అమెరికాలో హైదరాబాద్ కు చెందిన టీనేజ్ అమ్మాయిని ఒక దుండగుడు దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హతమార్చారు. పై చదువుల కోసం ఆమె దేశం కానీ దేశం అమెరికా కి వెళ్ళింది. ఆమె పేరు రూత్ జార్జ్(19).. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో హానర్స్ రెండవ సంవత్సరం చదువుతోంది.

అయితే ఈ నెల అంటే నవంబర్ 22 వ తారీకు నుంచి రూత్ జార్జ్ ఆచూకీ తెలియకుండా పోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు 23 వ తారీఖు ఉదయం 11 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే యూనివర్సిటీ అధికారులు స్పందించి.. పోలీసు సిబ్బందితో రూత్ జార్జ్ కోసం వెతికించారు. ఈ క్రమంలోనే వారు.. ఆమె వ‌ద్ద ఉన్న ఫోన్‌.. హాల్‌స్టెడ్ స్ట్రీట్ పార్కింగ్ గ్యారేజీ వ‌ద్ద పింగ్ అయిన‌ట్లు గుర్తించారు. ఆ ఫోన్ కోసం వెతుకుతూ గ్యారేజ్ లోకి వెళ్లిన వాళ్లకి.. రూత్ జార్జ్ తన సొంత కార్ బ్యాక్ సీట్ లో విగత జీవిగా కనిపించింది. కేసును ఛేదించడం కోసం పోలీసులు.. గ్యారేజ్ ఎదురుగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అప్పుడు వారికి రూత్ జార్జ్ గ్యారేజ్ లోకి ఒంటరిగా వెళ్లినట్లు తెలిసింది. కొంత సమయం తర్వాత నిందితుడు డోనాల్డ్    తుర్‌మాన్(26) కూడా ఆ గ్యారేజీలోకి వెళ్లిన‌ట్లు గుర్తించారు.

ఈ నెల 22న రూత్ జార్జ్ ని దారుణంగా అత్యాచారం చేసి.. ఆ తర్వాత గొంతు గట్టిగా నొక్కడంతో ఆమె చనిపోయిందని...ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం చేసిన వైద్యులు నిర్దారించారు. నిందితుడు తుర్‌మాన్ ను 48 గంటల్లోనే వెతికి పట్టుకున్నారు పోలీసులు. అరెస్టయినా ఈ నిందితుడు ఆ యూనివర్సిటీకి చెందిన వాడు కాదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇంతకుముందు అతనిపై ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ చెప్పారు.

చికాగోలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్     చాలా పెద్దది. సుమారు 33 వేల మంది ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. రూత్ జార్జ్‌ మృతి ప‌ట్ల యూనివ‌ర్సిటీ ప్ర‌క‌ట‌న చేసింది. మృతురాలి కుటుంబ‌స‌భ్యుల‌కు తీవ్ర సంతాపం తెలుపుతున్న‌ట్లు వ‌ర్సిటీ ఛాన్స‌ల‌ర్ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: