తెలంగాణ ఆర్టీసీపై కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా అంటే.. అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల 52 రోజుల పాటు జరిగిన సమ్మె ఆర్టీసీ చరిత్రలోనే జరిగిన సుదీర్ఘమైనదిగా రికార్డుకెక్కింది. అయితే సమ్మెకు వెళ్లిన యూనియన్లపై తెలంగాణ ప్రభుత్వం కనికరించకపోగా పూర్తిగా రివర్స్ అటాక్ చేసింది. దీంతో ప్రభుత్వం - యూనియన్ల మధ్య హోరాహోరీ మాటల యుద్ధంతో సమ్మె కొనసాగింది. ఇందుకు మరో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభు5 అడుగులు వేస్తోందని సమాచారం.

 

 

 

తెలంగాణలో ఆర్టీసీని పూర్తిగా మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఈ అంశంపై ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. దీనిపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని అప్పుడే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మొదటినుంచీ చెప్తున్న మాటలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకుంటున్నారనే అనుకోవాలి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సమ్మె ద్వారా కార్మికులు మరింత నష్టాల్లోకి తీసుకెళ్లారని ఇదివరకే అన్నారు. యూనియన్లు లేని ఆర్టీసీని ఉండాలని చెప్పిన కేసీఆర్ అంతకంటే పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నారని తెలియ వస్తోంది.

 

 

 

సమ్మె కాలంలో సంస్థపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సంచలనం రేపాయి. మొత్తానికి కార్మిక సంఘాలు సమ్మె విరమించినా ప్రభుత్వం మాత్రం కనికరించటం లేదు.ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేని విషయాన్ని కేసీఆర్ పదే.. పదే ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోనే కార్మికులు, బస్సులు ఎక్కువున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి గత వైభవం ఉండదు. ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ప్రయివేటు భాగస్వామ్యంతోనే బస్సులు నడువనున్నాయి. మరి.. దీనిపై కార్మికుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: