ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిలో రాజధాని నిర్మాణం తాత్కాలికంగా మాత్రమే చంద్రబాబు చేశారని అందుకే రాజధాని మార్పు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. అయితే రాజధాని మార్పు పై విషయాన్ని తెరమీదికి తెచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక అప్పటినుంచి రాజధాని మార్పు విషయంలో రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల నుంచి భూములు లాక్కొని రాజధానిని అభివృద్ధి చేయకుండా స్మశానంగా మార్చారంటూ  బొత్స వ్యాఖ్యానించారు. 

 

 

 అయితే బొత్స వ్యాఖ్యలపై టిడిపి నేతలు అందరూ విరుచుకుపడుతున్నారు. రాజధానిని  స్మశానం తో పోలుస్తూ బొత్స ఎలా వ్యాఖ్యానిస్తారు అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. రాజధాని అమరావతిని స్మశానం తో పోల్చిన బొత్స సత్యనారాయణను వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. భేషరతుగా మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో బొత్స సత్యనారాయణకు మెదడే లేదనే నిరూపణ అయింది మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిని స్మశానం తో పోల్చిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి జగన్ మీరు రోజు స్మశానంలో కూర్చునే పాలన సాగిస్తున్నారా  అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 

 

 

 

 అయితే దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు 30 వేల ఎకరాలను త్యాగం చేస్తే రైతుల త్యాగాలను మంత్రి బొత్స స్మశానం తో పోల్చటం  దారుణం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. రైతుల త్యాగాలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నాయా  అంటూ ప్రశ్నించారు. అమరావతిలోని హైకోర్టు శాసనసభ ఇవన్నీ మీకు స్మశానంలో కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిని స్మశానంలా ఉంది అని  శత్రువు కూడా పోల్చడు అని  చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చూస్తుంటేనే రాష్ట్రంలో ఎలాంటి నియంత పాలన సాగుతుందో అర్థం అవుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ తాను రాజధానిని స్మశానంతో  పోల్చ లేదని చంద్రబాబు రైతుల దగ్గర నుంచి వేలకు వేల ఎకరాలు లాక్కొని రాజధాని అభివృద్ధి చేయకుండా స్మశానంగా మార్చారని విమర్శించాను  అని బొత్స తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: