తెలంగాణ ఆర్టీసి కార్మికుల పై సీఎం కేసీఆర్ పక్షపాత వైఖరి చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించడం జరిగింది. తాజాగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్టీసి కార్మికుల పరిస్థితి చూస్తుంటే బాధనిపిస్తుంది. రాష్ట్ర విభజన తరువాత ఎంతో మేలు జరుగుతుందన్న ఆశతో టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దకు తమ డిమాండ్లను తీసుకెళ్లారు. 52 రోజుల సమ్మె చేశారు. వాళ్ళ కోరికలు నిజమైనవి. 

 

పేద వాళ్ళ కోసం ఏర్పాటు అయింది ఆర్టీసి కార్పోరేషన్. కానీ  ప్రయివేటు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్ని రోజులు సమ్మె చేసిన ఆర్టీసి కార్మికులు ప్రాణ నష్టం జరుగుతుందని సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ఆర్టీసి ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ విధుల్లోకి తీసుకోమని ప్రకటన చేశారు. ఆయన ఎవరు ప్రకటన చేయడానికి? కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఒక్కనాడు కూడా సునీల్ శర్మ ముఖం కానరాలేదు. ఇవాళ ఎందుకొచ్చిండు. ఆ రోజు ఎండీగా నీ విధి నిర్వహణను ఎందుకు మరిచావు సునీల్ శర్మ.  

 

ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో మంత్రులు లేరా? తెలంగాణ రాష్ట్రం విచిత్రమైన రాష్ట్రంగా ఉంది. ఆకలి అవుతున్నదని  చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన మేధావుల అందరూ ఎక్కడ ఉన్నారు అని  జగ్గారెడ్డి అన్నారు. 


 చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య , అల్లం నారాయణ, స్వామి గౌడ్, దేవి ప్రసాద్, కారం రవీందర్ రెడ్డి, రాజేందర్, మమత టీజీవో, టీఎన్జీవో  నేతలు ఎక్కడ ఉన్నారు. వీళ్లందరికి చీము నెత్తురు లేదా...? మీకు అసలు సిగ్గుందా..? ప్రభుత్వం కు  చెంచా గిరి చేస్తున్నార? చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఆర్టీసి కార్మికులను, ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్లు గా చేసినారు ఈ మేధావులు..ఇప్పడెక్కడ ఉన్నారు అని  జగ్గారెడ్డి అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: