జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరగకుండా పాలనను అందించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పొరుగు రాష్ట్రాల ప్రజలకు సైతం ఆదర్శంగా నిలిచేలా పాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అవినీతి రహిత ప్రదర్శక పాలన అందించేందుకు నడుం బిగించారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా 14400 టోల్ ఫ్రీ  నెంబర్కు ఫోన్ చేసి  ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి అవినీతి పై ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 


 అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఫోన్ చేసి పని చేస్తుందా లేదా అని చెక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ సెంటర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేసిన వారి ఫిర్యాదు పై 15 రోజుల్లో చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు.కాగా  ఈ టోల్ ఫ్రీ నెంబర్ నెంబర్ పై విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి . ఒకవేళ ఆ టోల్ ఫ్రీ నెంబర్ పని చేస్తే ప్రజలు వైసిపి నేతల అవినీతిపై చేసే  ఫిర్యాదులకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రాల జైలులు  కూడా సరిపోవు అంటూ విమర్శలు 
చేస్తున్నారు. పేరుకు మాత్రమే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు అని దాని నుంచి ఫిర్యాదులు స్వీకరించరు అనే విమర్శలు గుప్పిస్తున్నారు. 

 

 

 ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం ప్రజలకు సూచించిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఫిర్యాదు చేసింది ఎవరు అనుకుంటున్నారు టిడిపి నేత వర్ల రామయ్య. అమరావతి అవినీతిపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 14400 టోల్ ఫ్రీ నెంబర్ కు వర్ల రామయ్య ఫోన్ చేశారు. జగన్ అక్రమాస్తులపై అధ్యయనం చేయాలని ఈ టోల్ ఫ్రీ నెంబర్ తో కాల్ సెంటర్ కి ఫోన్ చేసి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నో అక్రమాస్తులు కూడా కట్టుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించినట్టుగానే తమ ఫిర్యాదులపై  15 రోజుల్లో  చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: