తెలుగుదేశంపార్టీ నేతల పిచ్చి పరాకాష్టకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇందుకు తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి జగన్మోహన్ రెడ్డి 14400 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఆ నెంబర్ కు మంగళవారం మధ్యాహ్నం పార్టీ నేత వర్ల రామయ్య మీడియాను దగ్గర పెట్టుకుని చేసిన ఫిర్యాదు విచిత్రంగా ఉంది.

 

14400 నెంబర్ కు ఫోన్ చేసిన వర్ల రాజకీయ అవినీతిపై ఫిర్యాదు చేయటానికి తాను ఫోన్ చేసినట్లు చెప్పారు. ఏ విషయం మీద ఫిర్యాదు చేయటానికి ఫోన్ చేశారని అడగ్గానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవినీతిపై ఫిర్యాదు చేయటానికి తాను ఫోన్ చేసినట్లు చెప్పారు. తండ్రి, దివంగత సిఎం వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2004-2006 మధ్య దాదాపు రూ. 43 వేల కోట్ల ఆస్తులను అన్యాక్రాంతం చేసినట్లు వర్ల ఆరోపించారు.

 

సరే వర్ల చేసిన ఫిర్యాదులన్నీ రాజకీయంగా ప్రచారం కోసమే అని అర్ధమైపోతోంది. లేకపోతే వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేయటానికి టోల్ ఫ్రీ నెంబర్ ను పెడితే జగన్ అవినీతి మీదే ఫిర్యాదు చేస్తానని వర్ల హడావుడి చేయటం ఉత్త డ్రామానే. జగన్ అవినీతిపై విచారణ చేస్తున్న సిబిఐ, ఈడి కేసుల విచారణను వేగవంతం చేయాలని వర్ల డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.

 

అసలు కోర్టుల్లో విచారణ జరుగుతున్న కేసుల గురించి వర్ల మాట్లాడటమే విచిత్రంగా ఉంది. పైగా విచారణలో వ్యక్తిగతంగా హాజరుకావటానికి జగన్ ఎందుకు వెనకాడుతున్నారు ? ఎందుకు భయపడుతున్నారు ? అంటూ వితండ వాదన వినిపించారు. మరి వర్ల కామెంట్ ప్రకారమే చూసుకుంటే తనపైన ఉన్న కేసుల్లో అసలు విచారణే జరగకుండా చంద్రబాబు ఎందుకు స్టేలు తెచ్చుకున్నట్లు ?

 

చంద్రబాబు మీద ఉన్న మిగితా కేసులను పక్కనపెట్టినా ఓటుకునోటు కేసు విచారణ జరిగితే చాలు. పైగా తాను చేసిన ఫిర్యాదును కాల్ రికార్డు చేసిన తర్వాత మళ్ళీ తనకు వినిపించాలని అడగటమే డ్రామాలో హైలైట్.  మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బతో చాలామందికి మైండ్ బ్లాంక్ అయినట్లే అనిపిస్తోంది. అధికారంలో ఉన్నపుడు ఇలాగ మాట్లాడితేనే జనాలకు మండి 23 సీట్లిచ్చి కూర్చోబెట్టింది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: