ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్ల తో బస్సు లో నడిపిస్తుంది ప్రభుత్వం. దీంతో ప్రయాణికులకు పాట్లు మొదలయ్యాయి . అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లు విధుల్లోకి తీసుకోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చాలా మంది తాత్కాలిక డ్రైవర్లు చాలా రోడ్డు ప్రమాదాల కారణమయ్యారు. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నారు . నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతూ అటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో... వేరే  వాహనంపై వెళ్తున్న ప్రజలకు కూడా ప్రాణ రక్షణ కరువయ్యేలా  డ్రైవింగ్ చేస్తున్నారు. ఇప్పటికే తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్య డ్రైవింగ్ తో ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నారు . 

 

 

 ఇప్పుడు తాజాగా తాత్కాలిక డ్రైవర్  లక్ష్యంతో మరో ప్రాణం పోయింది. హైదరాబాద్ బంజారాహిల్స్ మాసాబ్ ట్యాంక్ రోడ్డు లో ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 12 లో  స్కూటీని ఆర్టిసి బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ పై ప్రయాణిస్తున్న మహిళ తల పైనుంచి ఆర్టిసి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు స్థానికులు  ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ వల్లే జరిగిందని భావించి తాత్కాలిక బస్సు డ్రైవర్ పై ఒక్కసారిగా దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపి ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్ ను  చితకబాదారు జనం. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

 

 

 

 అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను శాంతింపజేశారు.అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళ టాటా కన్సల్టెన్సీ లో పనిచేస్తున్న సోహిణి సక్సేనా గా  గుర్తించారు పోలీసులు. అయితే ఈ రోడ్డు ప్రమాదం తో రోడ్ నెంబర్ 12 లో ట్రాఫిక్ జామ్ అయింది. మాసబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ వెళ్లే  వాహనాలు నిలిచిపోయాయి. ఇక సంఘటన స్థలికి చేరుకున్న  పోలీసులు మహిళా డెడ్బాడీని పోస్టుమార్టం కు తరలించారు. ఇక  ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఇదిలా ఉండగా ఇప్పటికి ఇది మొదటి ప్రమాదం ఏమీ కాదు. తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం అతి వేగం కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలందరూ తాత్కాలిక డ్రైవర్లు తీరు  రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: