మహారాష్ట్ర రాజకీయాలన్ని  హాట్ హాట్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా  ఎవరూ ఊహించని విధంగా బిజెపి ఎన్సీపీ  నేత అజిత్ పవార్  మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీలు  24 గంటలు బలపరీక్ష నిరూపణ  చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై రెండు రోజులపాటు విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు ఉదయం  తీర్పును వెలువరించింది. 24 గంటల్లోగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలన్ని  హాట్ హాట్ గా సాగుతున్న వేళ మరో మహా రాజకీయాల్లో  మరో కొత్త ట్విస్ట్ తెరమీదకి వచ్చింది . ప్రభుత్వ ఏర్పాటు కోసం బిజెపి పార్టీకి మద్దతు తెలిపిన ఎన్సీపి నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 

 

 

 

 బిజెపి బల పరీక్షకు ముందే  ఉపముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ వెనక్కి తగ్గి రాజీనామా చేయడం ప్రస్తుతం మహా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన పంతం నెగ్గించుకున్నట్లు  కనిపిస్తోంది. అజిత్ పవార్ కుటుంబీకుల నుంచి ఒత్తిడి తేవడం వల్ల అజిత్ పవార్  ఉపముఖ్యమంత్రిగా రాజీనామా చేసినట్లు సమాచారం. అజిత్ పవార్ భార్య మేనల్లుడు తో శరద్ పవార్ అజిత్ పవార్  రాజీనామా చేసేందుకు ఒత్తిడి తీసుకురావడం వల్ల అజిత్  పవార్  రాజీనామా చేశారని మహా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్  యొక్క పూర్తి సభ్యత్వాన్ని తొలగించలేదని తెలుస్తున్డక్ . అజిత్ పవార్ ను మళ్ళీ  ఎన్సీపీ లో చేర్చుకోవాలనే  ఉద్దేశంతోనే పూర్తి సభ్యత్వాన్ని శరత్ పవార్  తొలగించ లేదని తెలుస్తోంది.

 

 

 

 ఇదిలా ఉంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్  మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అంతే కాకుండా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని మహా రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. కాగా నేడు 3.30 నిమిషాలకు దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా సమావేశంలో ఏం చెప్పనున్నారు అనేది ఆసక్తిగా మారింది . అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్  రాజీనామా చేయడం ప్రస్తుతం మహా  రాజకీయాలు సంచలనంగా మారింది. ఈరోజు ఉదయమే బలనిరూపణకు సుప్రీంకోర్టు 24 గంటల సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే బలనిరూపణకు ముందే అజిత్ పవార్ రాజీనామా చేయడం  సంచలనంగా మారింది. అయితే బలనిరూపణకు ముందే అటు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని మహా రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: