మహారాష్ట్ర రాజకీయాలన్ని  హాట్ హాట్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా  ఎవరూ ఊహించని విధంగా బిజెపి ఎన్సీపీ  నేత అజిత్ పవార్  మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీలు  24 గంటలు బలపరీక్ష నిరూపణ  చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై రెండు రోజులపాటు విచారించిన సుప్రీంకోర్టు ఈరోజు ఉదయం  తీర్పును వెలువరించింది. 24 గంటల్లోగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలన్ని  హాట్ హాట్ గా సాగుతున్న వేళ మరో మహా రాజకీయాల్లో  మరో కొత్త ట్విస్ట్ తెరమీదకి వచ్చింది . ప్రభుత్వ ఏర్పాటు కోసం బిజెపి పార్టీకి మద్దతు తెలిపిన ఎన్సీపి నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

 

 

 

 దీంతో బిజెపి పార్టీ కి భారీ షాక్ తగిలినట్లయింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మీడియో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఏం చెప్పనున్నారు అనేది మహా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది . మహా పరిణామాలు ఎటునుంచి ఎటు తిరుగుతున్నాయో  కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. గంట గంటకి మహా రాజకీయ పరిణామాలు సమీకరణాలు మారిపోతున్నాయి. ఊహించని ట్విస్టులు తెర మీదకు వచ్చే అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. ఇప్పటికే తమకు ఎంతో మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు ప్రభుత్వ ఏర్పాటుకు  బీజేపీకి మద్దతు తెలిపిన ఎన్సీపీ  నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజుల్లోనే రాజీనామా చేయడంతో...తాము బలనిరూపణలో నెగ్గ వచ్చు  కొంచమైన నమ్మకం ఉన్న బీజేపీ కి అజిత్ పవార్ రాజీనామా  వెన్నుపోటు పొడిచినట్లయింది . 

 

 

 

 ఇక  బీజేపీ బలనిరూపణ చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే  అవకాశాలు తక్కువగానే ఉన్నాయి... ఎందుకంటే ఇప్పటికే ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీల కూటమికి 162 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్నట్లు నిన్న  గ్రాండ్ హయత్ హోటల్ వేదికగా మీడియా ముందు నిరూపించారు. ఇలాంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ అమిత్ షా లు సంచలన వ్యూహంతో అజిత్ పవార్ ను తమ వైపు తిప్పుకుని  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత బల నిరూపణ కోసం గవర్నర్ ఇచ్చిన సమయం లోపు మిగతా పార్టీల మద్దతు కూడగట్టేందుకు వేసిన ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది. దీంతో ఇంకొద్దిసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయని మహారాష్ట్ర రాజకీయాలు చర్చలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: