మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎన్నో పరిణామాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా  దేవేంద్ర ఫడ్నవిస్  ముఖ్యమంత్రి గా బీజేపీకి మద్దతు తెలిపిన ఎన్సీపీ  నేత అజిత్ పవార్ ఉప  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. అయితే తాజాగా ఉప ముఖ్యమంత్రి పదవికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజీనామా చేయడం సంచలనం గా మారిన విషయం. అంటే ఇంకొద్దిసేపట్లో మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు రాగా అది నిజమైంది. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు నిర్వహించిన  దేవేంద్ర ఫడ్నవిస్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బిజెపి ప్రభుత్వానికి ప్రజామోదం తో ఉందని  తెలిపారు. 

 

 

 

 మహారాష్ట్ర ప్రజానీకం మొత్తం బిజెపి పార్టీకే పట్టం కట్టారని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. అయితే బలనిరూపణకు ముందే తమకు సరైన సంఖ్యాబలం లేదని తెలిపిన  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా  మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీకి పట్టం కట్టినప్పటికీ  శివసేన ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వెళ్ళింది అంట దేవేంద్ర ఫడ్నవీస్ ఆవేదన వ్యక్తం చేసారు . శివసేన పార్టీకి విడతలవారీగా సీఎం పదవిని కట్టబెట్టేందుకు తాము హామీ ఇవ్వలేమని దీంతో ప్రజా నిన్ఱాయానికి  వ్యతిరేకంగా శివసేన వెళ్లిందని ఆయన ఆరోపించారు. అయితే శివసేన నిర్ణయం కోసం బిజెపి పార్టీ ఎంతగానో ఎదురు చూసిందని  అయినప్పటికీ శివసేన పార్టీ మాత్రం వేరే పార్టీలతో మంతనాలకు  దిగినట్టు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. 

 

 

 అయితే ప్రభుత్వ ఏర్పాటుకోసం కూటమిగా ఏర్పడినా ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన పార్టీ భావాలు  భిన్నమైనవని అని ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. తనకు ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ కొనసాగలేనని చెప్పారని అన్నారు. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడంతో శివసేన కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే సుప్రీంకోర్టు బలనిరూపణ   కోసం ఇచ్చిన 24 గంటలు సమయం ఇచ్చినప్పటికీ... తమ  దగ్గర సరైన సంఖ్యా బలం లేకపోవడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఎన్సీపీ  కాంగ్రెస్ శివసేన  పార్టీల బలనిరూపణ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: