మహారాష్ట్రలో మూడు రోజుల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం అసెంబ్లీలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా.. దానికి 24 గంటల ముందే ఆయన పదవి నుంచి తప్పుకొన్నారు. తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేసిన సరిగ్గా రెండు గంటల వ్యవధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 

 

     శివసేన-ఎన్సీనీ-కాంగ్రెస్ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాతో ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బాటలు పడ్డాయి. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైనట్టే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నాయకులకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆహ్వానించడం ఇక కేవలం లాంఛనప్రాయమే. బల పరీక్షకు ముందే- తొలుత అజిత్ పవార్, ఆ తరువాత దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాలు చేయడం కలకలం పుట్టించింది. 

 

 

    తాను రాజీనామా చేసిన విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన 3:30 గంటలకు తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. బీజేపీ, శివసేన కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ప్రజలు తీర్పు ఇచ్చారని, దానికి విరుద్ధమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో మలుపులు తిరిగి, అందరినీ ఉత్కంఠకు గురిచేసిన మహారాష్ట్ర రాజకీయం కు నేటితో తెరపడుతుందా?? లేక మరేదైనా జరిగి మళ్ళీ మొదటకు వస్తుందో వేచి చూడవలసిందే....
 

మరింత సమాచారం తెలుసుకోండి: