మహారాష్ట్ర రాజకీయాల్లో మహా కుదుపు వచ్చింది. ఎవరి ఊహకు అందని పరిణామాలు జరిగిపోయాయి. సీఎంగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్, అజిత్ పవార్ అరగంట తేడాతో రాజీనామాలు చేయడం ఎవరి ఊహకు అందనివి. ఈ మొత్తం పరిణామాల్లో అజిత్ పవర్ కుటుంబసభ్యులు చక్రం తిప్పారని సమాచారం.

 

 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అణా కొడుకైన అజిత్ పవార్ పార్టీలో కీలక వ్యక్తి. శరద్ పవార్ తర్వాత ఆయనదే కీలక పదవి. అయితే మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడు పార్థ్ కు టికెట్ ఆశించి భంగపడ్డారు. కానీ చివరి నిమిషంలో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోగలిగారు. అయినా పార్థ్ ఓడిపోయాడు. ఇవన్నీ అజిత్ కు మనశ్శాంతి లేకుండా చేసాయి. ఇందుకు కారణం శరద్ పవార్ కుమార్తె ఎంపీ సుప్రియ సూలే. నిజానికి సూలే సింగపూర్ లో సెటిల్ అయ్యారు. కానీ.. తండ్రి రాజకీయ వారసత్వం కోసం ఆమె అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో స్థిరపడ్డారు. శరద్ పవార్ కు మగ పిల్లలు లేనందున తన కుమారుడే ఎన్సీపీకి, శరద్ కు వారసుడు అవుతాడని భావించిన అజిత్ కు సుప్రియ రాక మొదటినుంచీ నచ్చలేదని సమాచారం. ఈ నేపధ్యంలోనే ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. గతంలో వివిధ పదవులు, ఓసారి డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవం అజిత్ కు ఉంది.

 

 

అజిత్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకే ఆమె సింగపూర్ నుంచి వచ్చేసారని ఓ వార్త ఉంది. అజిత్ బీజేపీ వైపు వెళ్లగానే ఆమె ట్విట్టర్, వాట్సాప్ ల్లో 'బంధుత్వాల్లో ఎంత నిజాయితీ ఉందో, ఎవరిని నమ్మాలో వద్దో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది' అంటూ  మెసేజ్ చేశారు. దీంతో ఇద్దరి కుటుంబాల్లో చీలికలు వస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఒత్తిడి తట్టుకోలేని అజిత్ తన పదవికి రాజీనామా చేసారు. మూడు రోజుల క్రితం ఏ ప్రభుత్వాన్నీ ఆయన నిలబెట్టారో ఇప్పుడదే ప్రభుత్వం కూలిపోవడంలో కీలక పాత్ర వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: