ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తాడేపల్లిలో కొత్తగా నిర్మించుకున్న ఇంటిలో గృహప్రవేశం చేసిన తర్వాతనే  ఎన్నికల ఫలితాలు వచ్చాయని, తాను ముఖ్యమంత్రి అయ్యానని సెంటిమెంట్‌తో ఉన్నారేమో కానీ తన ఇంటిని అపురూపంగా చూసుకుంటున్నారు. ఆ ఇంటి నిర్వహణకు ఏడాదికి రూ. కోటిన్నర ఖర్చు పెడుతున్నారు. నిర్వహణ అంటే ఎక్కడా కొద్దిగా మట్టి అంటకుండా, రోజూ తుడిపించడం, రెగ్యూలర్‌గా స్విచ్‌లు, ఫ్యాన్లు, లైట్లు చెక్ చేయడం లాంటివవన్నమాట. 

 

 

    ఈ మాత్రం దానికే రూ. కోటిన్నర ఖర్చు పెడుతున్నారా అని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఆయన తన సొంత డబ్బులు పెట్టడం లేదు. రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బునే తన ఇంటి మెయిన్‌టనెన్స్ కూడా వాడుకుంటున్నారు. ఇప్పటికే.. ఆ ఇంటికి.. ఏసీలు, కిటికీలు ఉంటూ… దాదాపుగా రూ. పదహారు కోట్లు విడుదల చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. తాజాగా.. తాను ఉంటున్న నిర్వహణ ఖర్చును మాత్రం ఎందుకు వదిలేయాలనుకున్నారు. తాను ప్రజల కోసం నిరంతరం పని చేస్తూ.. తాడేపల్లిలోని ఇంట్లో ఉంటున్నాను కాబట్టి, తన ఇంటి మెయిన్‌టనెన్స్ ఖర్చు ప్రజలే భరించడం కరెక్టని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వివిధ పద్దుల కింద అక్షరారా.. రూ. కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలు విడుదల చేస్తూ, ఉత్తర్వులివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఆదేశాలు వచ్చేశాయి. 

 

 

       ఒక్క తాడేపల్లి ఇంటికే కాదు.. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఇంటికి కూడా.. ఏపీ ప్రజల సొమ్మును… వాడుకుంటున్నారు. అక్కడ ఎలక్ట్రో… ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసమంటూ.. రూ. 35 లక్షలు విడుదల చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండటం లేదు. ఎప్పుడైనా… శుక్రవారం పని లేదా… ఇతర అవసరాల కోసం.. వెళ్లినప్పుడే.. లోటస్ పాండ్‌కు వెళ్తున్నారు. అయినప్పటికీ.. అక్కడి మెయిన్‌టనెన్స్ ఖర్చులను కూడా ప్రభుత్వం ఖాతాలోనే.. జగన్మోహన్ రెడ్డి వేసేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: