మహారాష్ట్రలో రాజకీయం గత వారం రోజులుగా వేడివేడిగా ఉంది.. కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మాత్రం గత ఆరు నెలలుగా వేడి వేడిగానే కొనసాగుతుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిందే యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయన మాట్లాడే ప్రతి మాట అయన తీసుకునే ప్రతి నిర్ణయం సంచలనమే. 

                    

అన్ని ప్రజలకు మంచి జరిగే సంచలన నిర్ణయాలే. ప్రతి పేద వాడి ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటాడు. ప్రతి రైతుకి తోడు నిలవాలని సీఎం సర్ ఆశ.. ఇంత మంచి రాష్ట్రంలో ఒకేసారి జరిగే సరికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని సుపుత్రుడు నారా లోకేష్, పచ్చ మీడియా అవి చూడలేక కళ్ళలో కారం పోసుకొని మరి రాష్ట్రంలో అల్లరి చేస్తున్నారు.  

             

అయితే ఈ అల్లర్లు అన్ని నచ్చని టీడీపీ ఎమ్మెల్యేలు స్వయానా వారి పార్టీనే ఛీ కొడుతున్నారు.. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశి వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో నేడు సీఎం జగన్‌తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో వంశీ సమావేశమయ్యారు. 

              

మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. టీడీపీకు రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన వంశీ.. ఇకపై సీఎం జగన్‌తో కలిసి నడుస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన వల్లభనేని వంశి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై తీవ్ర భారీస్థాయిలో విమర్శలు చేసి కొద్దిరోజులు వార్తాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: