న్యూయార్క్ లో ఒక దొంగ ఏ ఇంటికి కన్నం వేద్దామా...! అంటూ వీధుల వెంట తిరగసాగాడు. అయితే చివరికి ఒకరోజు 82 ఏళ్ల బామ్మ ఉండే ఇంటిని ఎంచుకున్నాడు. అంతేకాకుండా ఆ ఇంటిలో కేవలం ఆమె మాత్రమే నివసిస్తుందని రెండు మూడు రోజులు కాపుకాసి తెలుసుకున్నాడు. ఆమె ఒంటరిగా ఉంటుందన్న విషయం తెలుసుకోగానే.. ఆ దొంగ... బామ్మాని సులువుగా బెదిరించి ఇంటిలోని సొమ్మును మొత్తం ఈజీగా దొంగలించవచ్చని అనుకున్నాడు.
అయితే అతనిలో ఒకరోజు ఎప్పుడు లేని ధైర్యం వచ్చింది.. కాళ్లకు రెక్కలు వచ్చాయి.. వెంటనే 82 ఏళ్ల బామ్మ ఇంటి ముందు వచ్చి వాలిపోయాడు. లోపలికి ధైర్యంగా వెళ్ళాడు.. కానీ బయటికి రాలేక పోయాడు..అస్సలు నిల్చోలేక పోయాడు.. చివరికి ఆ బామ్మే అతన్ని బయటకి మోసుకువచ్చి ఇంటిముందు పడేయాల్సిన పరిస్థితి వచ్చింది..

 


ఇంతకీ లోపల ఏం జరిగిందనుకుంటున్నారా? ఒక్కసారి బ్లేడ్ బాబ్జి సినిమాలో దొంగతనానికి వెళ్లిన వేణు మాధవ్ ని పావలా శ్యామల ఎదుర్కొనే సన్నివేశాన్ని గుర్తుతెచ్చుకోండి.. మీకు ఇట్టే అర్థమైపోతుంది.. ఆ రీల్ లైఫ్ లో శ్యామల కరాటే ఛాంపియన్ అయితే... ఈ రియల్ లైఫ్ లో 82 ఏళ్ల 'విల్లీ మార్ఫీ' ఒక బాడీ బిల్డింగ్ ఛాంపియన్. అయితే ఆ దొంగ వచ్చిన వెంటనే తలుపులను టపటపా బాది.. అంబులెన్సునుకు కాల్ చేయండంటూ విల్లీ మర్ఫీ ని కోరాడు... అయితే విల్లీ మాత్రం.. ఎందుకు? ఏమైంది? అని ప్రశ్నిస్తూ తలుపులు తియ్యకుండా మాట్లాడుతుంది...



సహనం కోల్పోయిన దొంగ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాడు.. బామ్మకు విషయమంతా అర్థమైంది.. వెంటనే ఇంట్లో ఉన్న ఒక టేబుల్ ను చంద్రముఖి సినిమాలో జ్యోతిక మంచాన్ని లేపినట్లు... ఈ బామ్మా కూడా ఒక్క చేత్తో లేపి దొంగ మీదకి విసిరింది.. పాపం ఆ టేబుల్ తగిలి దొంగ కింద పడిపోయాడు.. అదే దెబ్బకు టేబుల్ కూడా ముక్కలైంది. ఆ తర్వాత టేబుల్ నుంచి విరిగి పడిన స్టాండ్‌ను పట్టుకుని అతడిని చితకబాదింది. డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ లో ఒక కుస్తీ ఆటగాడు మాదిరే.. ఆ దొంగ పై కూర్చొని పిడిగుద్దుల వర్షం కురిపించింది.

ఆమె తన జీవిత కాలంలో ఇంతలా బాడీ పెంచినా ఎవరినీ కొట్టలేకపోయానే అనే బాధ గుర్తుతెచ్చుకొని మరీ... అతడిని ఫుల్ గా కొట్టి ఆమె కోరికను తీర్చుకుంది.. బాగా చితక్కొటించుకున్న ఆ దొంగ విలవిల్లాడి.. వదలిపెట్టాలని వేడుకున్నాడు. తాను పైకి లేవలేకపోతున్నానని, బయటకు తీసుకెళ్లాలని బామ్మని కోరాడు. దీంతో బామ్మ అతడి చేతులు పట్టుకుని బయటకు లాక్కొని వెళ్లింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తన ఇంటి ముందు దొంగ దెబ్బలతో పడివున్నాడని, అంబులెన్సుతో వచ్చి అతడిని తీసుకెళ్లామని చెప్పింది.. బహుశా ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే కాబోలు. విల్లీ మర్ఫీ మాట్లాడిన వీడియో చూడాలనుకునే వారు.. ఈ అకౌంట్ (Seth Palmer @sethpalmer3/Twitter) కోసం ట్విట్టర్ లో వెతకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: