మహారాష్ట్ర లో ఎన్నో మలుపులు ఎన్నో సమీకరణాలు ఎన్నో ఎత్తులు మరెన్నో  పైయెత్తుల మధ్య చివరికి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బలనిరూపణ చేసుకోలేక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు విరమించుకోవడం తో బిజెపి ప్రభుత్వం కూలిపోయింది దీంతో ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. దీంతో మహారాష్ట్రలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన సంకీర్ణ ముందుకు రావటంతో  గవర్నర్ రాజ్ భవన్ లో  ప్రమాణ స్వీకారం చేయించారు. 

 

 

 

 కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాసు కొలంబకర్  ను నియమించారు . రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ కాళిదాసు కోలంబుకర్ . శివసేన నాయకుడే మహారాష్ట్ర తర్వాత ముఖ్యమంత్రిగా అవతరించాడు . కాగా మహా రాజకీయాల్లో శివసేన తన పంతం నెగ్గించుకుంది. మొదటి నుంచి తమ పార్టీ నాయకుడీనే  సీఎం సీటులో కూర్చో బెట్టాలి అని  పట్టుబట్టిన శివసేన బీజేపీతో పొత్తు విభేదించి ఆ తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతు  కోసం మంతనాలు జరుపగా ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. బిజెపి తెర మీదికి వచ్చి ముఖ్యమంత్రిగా దేవేంద్ర పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ... బల నిరూపణ చేసుకోలేని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కూలిపోయింది దీంతో మూడు రోజుల పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. 

 

 

 

 ఎన్నో ట్విస్ట్ లు  ఎత్తులు పైయెత్తుల మధ్య చివరికి శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా  శివసేన పార్టీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టనుండగా  కాంగ్రెస్ ఎన్సిపి పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులను కట్టబెట్టనున్నారు .కాగా  ఎన్సీపీ పార్టీలు ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి కట్టబెడుతున్నారనేది  కూడా ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపి విరమించిన  విషయం తెలిసిందే. ఈ క్రమంలో అజిత్ పవార్ కి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారా  లేక వేరే నేతలకు ఉప  ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టతారా  కూడా మహా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: