మూడు రోజులుగా ఉత్కంఠతను కలిగించిన మహారాష్ట్ర రాజకీయాలు ఒక కొలిక్కి వచ్చాయి.  మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు  ఉంటాయో అందరికి తెలిసిందే.   మాములుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉండే రాజకీయాలు వేరు.. మహారాష్ట్ర రాజకీయాలు వేరు.  ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలా అడుగులు వేస్తారో ఎలా ఎవరు ప్రవర్తిస్తారో ఎవరూ చెప్పలేరు.  ఇప్పుడు ఒకలా రాజకీయం ఉంటె మరి కాసేపటికి మరోలా మారిపోతుంది.  మహారాష్ట్రలో నిలబడి గెలిచాడు అంటే దేశంలో చక్రం తిప్పగలిగిన సామర్ధ్యం కలిగిన వ్యక్తిగా నిలబడతాడు అనడంలో సందేహం అవసరం లేదు.  
ఇకపోతే, మహారాష్ట్రలో అజిత్ పవార్ ను నమ్మి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  అయితే, చివరలో అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరడంతో రాజకీయాలు మారిపోయింది.  మహా వికాస్ అఘాడి కూటమి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది.  ఇది సంకీర్ణ ప్రభుత్వమే కానీ, ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎంతవరకు నిలబడుతుంది.. ఎలా నిలబడుతుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  
శివసేనకు హిందూ ఓటు బ్యాంక్ ఉన్నది.  కాంగ్రెస్ కు మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్నది.  అయితే,ఈ రెండు పార్టీలు కావడం వలన రెండు ఓటు బ్యాంకులు కలవడం పక్కన పెడితే.. రెండు కూడా ఇబ్బందులు పడతాయని అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.  రేపు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరిగితే.. ఆ తరువాత ఏం జరుగుంది అన్నది తరువాత విషయం. కాంగ్రెస్- ఎన్సీపీ మాత్రమే ఇప్పటి వరకు కలిసి ఉన్నాయి.  
కేవలం అధికారం కోసమే శివసేన బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీ - కాంగ్రెస్ తో కలిసింది.  కూటమిలో శివసేన ఉన్నట్టయితే.. ఈపాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు.  కానీ, శివసేన ముఖ్యమంత్రి పీఠం కోసం వెంపర్లాడటంతో ఇబ్బంది పడింది.  కేవలం 54 స్థానాలు మాత్రమే వచ్చిన శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడం అన్నది కుదరని పని అని చెప్పింది బీజేపీ.  నైతికంగా చూసుకుంటే శివసేన అడగడం కరెక్ట్ కూడా కాదు.  మరి సంకీర్ణ ప్రభుత్వం ఎలా ఎన్నాళ్ళు మనుగడలో ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: