మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ బీజేపీ ప్రభుత్వానికి లేదన్నది ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు. శివసేన - బీజేపీ కూటమి ఏర్పడటం కష్టమవటంతో బీజేపీ కన్ను ఎన్సీపీ మీద పడింది. అజిత్ పవార్ ను నమ్ముకొని ఏదో పీకేయాలని ప్లాన్ చేసింది. శనివారం తెల్లవారుజామున అనూహ్యంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. మహారాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-శివసేనలు పొత్తుతో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు.అయితే ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఆ రెండు పార్టీలూ కుమ్ములాడాయి. సీఎం పీఠాన్ని  పంచాలంటూ శివసేన ఆ ప్రసక్తే లేదని బీజేపీ వాదులాడుకున్నాయి. గడువులోగా అవి ఒప్పందానికి రాలేదు. ఎవరి వాదనలు వారు వినిపించారు. చర్చలకు కూడా ముందుకు  రాలేదు.


దీనితో బీజేపీ శివసేనతో కాదని చిరకాల మిత్రుడు దూరం అవడంతో బీజేపీ కన్ను మిగతా పార్టీల ఎమ్యెల్యేను చీల్చడం మీద పడింది. సమయం వరకూ వేచి చూసిన గవర్నర్ ముందుగా బీజేపీని పిలిచారు. అయితే తమకు బలంలేదని బీజేపీ ముందుకు వెళ్లలేదు.అక్కడితో ఆగిపోయి ఉంటే కమలం పార్టీ గౌరవం కాపాడుకునేది.  అయితే ఆ తర్వాత బీజేపీకి కన్నుకుట్టింది. సేన-కాంగ్రెస్-ఎన్సీపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే సరికి బీజేపీకి మండింది. అసహనం పుట్టి ఒక అర్థం లేని పని చేసింది. అజిత్ పవార్ ను నమ్ముకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చింది. అయితే అజిత్ కు ఉన్న బలమెంతో బీజేపీ అంచనా వేయలేకపోయింది. అతడేమో విశ్వాస పరీక్షకు ముందే చేతులెత్తేశాడు!



ఇక్కడే చాలా మందికి సందేహం వచ్చింది. అజిత్ పవార్ ను బీజేపీ ఎలా నమ్మిందని ..  అసలు అలాంటి వ్యక్తిని నమ్ముకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసింది? అంటూ  అనేక మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాడినా బీజేపీ నమ్ముకున్నది అనే కామెంట్ వినిపిస్తూ ఉంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం అమిత్ షా చాణక్యం అంటూ కమలం పార్టీ వాళ్లు కొందరు చంకలు  గుద్దుకున్నారు. తీరా ఇప్పుడు  పోయింది బీజేపీ పరువే. ఇది వరకూ ఇలానే కర్ణాటకలో కొన్నాళ్ల కిందట బీజేపీ పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు మహారాష్ట్రలో అలాంటి అనుభవానే ఎదుర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: