మెగా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకు ఎంట్రి ఇచ్చినా  తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. కెరియర్ ని మెల్లగా మొదలుపెట్టిన ప్రస్తుతం టాప్ గేర్ లో  దూసుకుపోతున్నారు ఈ మెగా హీరో. వరుస విజయాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. అంతేకాదండోయ్ వరుణ్ తేజ్ డేట్స్ కోసం  దర్శకులందరూ క్యూ  కడుతున్నారు . తొలిప్రేమ సినిమా తో క్లాసిక్ లుక్ తో అదరగొట్టిన ఈ యంగ్ హీరో... ఆ తర్వాత ఎఫ్2 తో సీనియర్ హీరోతో సంక్రాంతి అల్లుడు గా వచ్చి సందడి చేశాడు...ఇక ఆ తర్వాత  గద్దల కొండ గణేష్ తో ఒక రేంజ్ లో పాపులర్ అయ్యి  తన లో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో  నిరూపించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. వరుస సినిమాలతో దూసుకుపోతూ స్టార్ హీరోల రేసులో చేరేందుకు తహతహలాడుతున్నాడు. 

 

 

 

 అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ మెగా హీరో తన కెరీర్ ను కూడా అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తన రెమ్యూనరేషన్ విషయంలో ముందు నుంచి కూడా నిర్మాతలకు అనుగుణంగానే ఉంటున్నాడు ఈ మెగా హీరో. తన సినిమాలకు ఉండే మార్కెట్ ని లెక్క వేసుకుంటూ తన రెమ్యునరేషన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక సినిమా సినిమాకి తన రెమ్యూనరేషన్ ను పెంచుకుంటూ వస్తున్నాడు యువ హీరో. ప్రస్తుతం వరుస విజయాలతో టాప్ గేర్ లో దూసుకుపోతున్న వరుణ్ తేజ్  రెమ్యునరేషన్ కూడా బాగానే పని చేసినట్లు సమాచారం. తొలిప్రేమ ఎఫ్2 ఫిదా ఇలాంటి సినిమాలు మంచి విజయం సాధించడంతో అటు  దర్శకనిర్మాతలు కూడా ఈ మెగా హీరో దగ్గరికి క్యూ కడుతున్నారు. 

 

 

 

 ఇక తాజాగా విడుదలైన గద్దల కొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించడమే కాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా భారీగానే రావడంతో... వరుణ్ తేజ్  మార్కెట్ కాస్త హై లెవల్ అయిపోయింది. దీంతో తన మార్కెట్కు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా పెంచేసాడు ఈ మెగా హీరో. అయితే మొన్నటి వరకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకున్న ఈ మెగా వారసుడు ఇప్పుడు ఏకంగా 8 కోట్లకు తన పారితోషికాన్ని పెంచేసినట్లు  సమాచారం. దర్శకనిర్మాతలు కూడా వారితో సినిమా తీస్తే వసూళ్లు  గ్యారంటీ అనే నమ్మకం తో కూడా ఉండడంతో ఆయన అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం కిరణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాని నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: