బీజేపీ వ్యూహాలు ఇలా దారుణంగా ఓడిపోవడం పార్టీ పరంగా పెద్ద దెబ్బేనని అంటున్నారు. ఓ వైపు చూస్తే జార్ఖండ్ లో ఎన్నికలు ఉన్నాయి. అలాగే ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో లుకలుకలు కూడా కాషాయానికి కలసిరావాల్సిఉంది. ఇక సౌత్ గేట్ లో భారీ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంది. కానీ ఒకే ఒక దెబ్బ, మహా దెబ్బ ధాటికి అన్నీ కూడా ఆవిరి అయిపోయేలా కనిపిస్తున్నాయి.

 

అజిత్ పవార్ ని నమ్ముకుని నిండా మునిగిన బీజేపీకి ఇపుడు దేశవ్యాప్తంగా తలవంపులే మిగిలాయి. బీజేపీది డబ్బా ప్రచారం తప్ప ఏమీ లేదని ప్రత్యర్ధులు ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడుతోంది. అదే సమయంలో రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు కూడా రాజకీయంగా ఇబ్బందులు కలిగేలా మహా పరాభవం ఉందని కాషాయం పార్టీలో చర్చ సాగుతోంది

 

ఇక జార్ఖాండ్ లో బీజేపీకి ఇప్పటికే వ్యతిరేకత ఉంది. మహారాష్ట్ర పరిణామాలతో పరువు నిండా పోయింది. దాంతో బీజేపీకి ఇక్కడ జనం నుంచి ఎలాటి తిరస్కారం ఎదురవుతుందో అన్న భయం కలుగుతోంది. ఢిల్లీలో మధ్యతరగతి, విధ్యావంతులు ఎక్కువగా ఓటర్లు, మహారాష్ట్ర పరిణామాలను వారంతా నిశితంగా పరిశీలించారు. బీజేపీ రాజకీయ నీతి నేతిబీరకాయ చందంగా ఉందని  అంటున్నరు. ఇక వారిలో కనుక వ్యతిరేకత తీవ్రమైతే మరోమారు ఆప్ సర్కార్ అక్కడ ఏర్పడడం ఖాయం.

 

మరో వైపు మధ్యప్రదేశ్ లో కమలనాధ్ సర్కార్ పడుతూ లేస్తూ ఉంది. ఆ సర్కార్ లో అసమ్మతి పుడుతోంది. సీనియర్ నేత జ్యోతీరాదిత్య నాయకత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు విడిపోతే బీజేపీ సర్కార్ కి అవకాశం ఉంటుంది. కానీ ఇపుడు మాహారాష్ట్ర పరిణామాలు చూస్తూంటే బీజేపీ సాహసం చేయలేని పరిస్థితి ఉంది.

 

ఇవన్నీ ఇలా ఉంటే సౌత్ లో గొప్పగా ఎంట్రీ ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలో పాగా వేయాలనుకుంటోంది. బీజేపీలోకి అంత మంది వస్తున్నారు, ఇంతమంది చేరుతున్నారు అని ఒక్కటే ఊదరగొట్టారు, ఇపుడు మహారాష్ట్రలో పరువు పోయాక ఏపీ లాంటి చోట్ల ఎవరైనా బీజేపీలో చేరడానికి కొంత సందేహిస్తారు. మళ్లీ బీజేపీకి ఈ పరాభవం మరుగున పరచే విధంగా కొత్త విజయాలు రావాలి. అంతవరకూ కాషాయం పార్టీ దూకుడుకు టెంపరరీగా బ్రేకులు పడ్డట్టే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: