మహారాష్ట్ర లో బీజేపీ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్ కీలక సమయం లో హ్యాండ్ ఇవ్వడం వెనుక అసలు మతలబు ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ కూటమి మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణం లో ,  శనివారం తెల్లవారుజామున నాటకీయ ఫక్కీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి గా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే .

 

 అజిత్ పవార్ , బీజేపీ తో చేతులు కలపడం వెనుక శరద్ పవార్ ప్రమేయం కూడా ఉండి ఉంటుందన్న ఊహాగానాలు కూడా విన్పించాయి . అయితే కూటమిలోని శివసేన , కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం , శరద్ పవార్ పై సంపూర్ణ విశ్వాసాన్ని   వ్యక్తం చేస్తూ వచ్చారు . దీనితో పవార్ , తన అన్న కుమారుడైన అజిత్ పవార్ ను వెనక్కి రప్పించేందు అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది . ఒకవైపు పార్టీ నేతల ద్వారా అతనితో మంతనాలు జరుపుతూనే , మరొకవైపు కుటుంబ సభ్యులను రంగం లోకి దించినట్లు సమాచారం . అజిత్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఒకొక్కరు చేజారి , శరద్ పవార్ పంచన చేరడం తో , తానింకా  చేసేది ఏమి లేదని భావించిన అజిత్ పవార్ అటు పార్టీ అగ్ర నేతలు , ఇటు కుటుంబ సభ్యుల హితబోధనలకు తలొగ్గినట్లు తెలుస్తోంది .

 

 సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యం లో బలనిరూపణకు ముందే అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేయడం తో చేసేదేమి లేక దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అనివార్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: