ఇది చలికాలం.. వర్షాలు ఏంటి అనుకునేరు.. ఏకాలం అయినా వర్షాలకు రావాలి అనిపిస్తే వస్తాయి.. లేదంటే లేదు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.     

 

ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ భారీస్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఆ ఈ ప్రాంతాల్లో రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.      

 

అయితే ఆ రాష్ట్రాలలో వర్షాలు భారీగా రాగా తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు స్వల్పంగా రానున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాగా మన తెలుగురాష్ట్రాలకు 15 రోజుల క్రితం వరుకు భారీ వర్షాలు కురిసి పంటలు అన్ని నాశనం చేసిన సంగతి తెలిసిందే.      

 

ఈ నేపథ్యంలోనే మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఈ వర్షాల కారణంగా అటు రైతులకు ఇటు నగరంలోని ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అంతే కాదు చిన్న వర్షం పడిన సరే హైదరాబద్ ప్రజలు ట్రాఫిక్ లో అష్టకష్టాలు పడాలి. మరి ఎన్ని కష్టాలు పడిన వర్షాలు అయితే రావాల్సిందే..    

 

అయితే ఒక వైపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉంటె మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఉదయం పుట బయటకు వచ్చే ప్రజలు చలి కోట్లు ధరించడం ఎంతో మంచిది. కుదిరితే బయట చలికి వణికిపోయే ప్రజలకు చలి కోట్లను అందించడం మరి మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: