శివసేన పుట్టింది హిందుత్వాన్ని కాపాడడం కోసం.. హిందువుల కోసం పోరాటం చేసే పార్టీ.  మహారాష్ట్రలో ఆ పార్టీకి అలాంటి ట్యాగ్ ఉన్నది.  గత 30 ఏళ్లుగా ఆ పార్టీ హిందుత్వవాదాన్ని బలంగా వినిపించే పార్టీగా ఉన్నది.  హిందువులకు పెద్ద దిక్కుగా ఉన్న పార్టీగా ఆవిర్భవించింది.  అలాంటి హిందుత్వ పార్టీ ఇప్పుడు సామాన్య నేతలు మారినట్టుగా మాటలు మార్చింది.  అధికారం కోసం అప్పటి వరకు శతృవులుగా భావించిన కాంగ్రెస్ పార్టీతో ఆలింగనం చేసుకుంది.  
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.  పైకి ఎన్ని మాటలు చెప్పినా.. అంతిమంగా అధికారమే ముఖ్యం అని చెప్పుకునే చెప్తున్నాయి మహా రాజకీయాలు.  30 ఏళ్లపాటు కలిసి ఉన్న బీజేపీని పక్కన పెట్టి వెళ్లి కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడం అంటే హిందుత్వ వాదాన్ని పక్కన పెట్టడమే అని బీజేపీ నేతలు అంటున్నారు.  శివసేనలో నరనరాన హిందుత్వవాదాన్ని జీర్ణించుకున్న ఎమ్మెల్యేలు, నేతలు చాలామంది ఉన్నారు.  
అధినేతకు అధికారం అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు.  హిందుత్వ ట్యాగ్ పై విజయం సాధించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి.  రేపు నియోజక వర్గంలోకి వెళ్ళినపుడు.. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ తిరగాలి.  అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు శివసేన నాయకులను ఏమన్నా ఇప్పుడు పట్టించుకోకూడదు.  ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తోనే అధికారంలోకి వస్తున్నారు కాబట్టి.  
ఎవరిపై 30 ఏళ్ళు యుద్ధం చేశామో వాళ్ళే మమ్మల్ని నమ్మారు అని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే అన్నారు అంటే అర్ధం ఇదే కదా మరి.  శివసేన పార్టీ సోనియా ముందు మోకరిల్లినట్టే కదా.  అంటే హిందుత్వవాదం సోనియా ముందు మోకరిల్లింది అని అర్ధం చేసుకోవచ్చు.  దీనిని మహరాష్ట్రలో హిందుత్వవాదాన్ని బలంగా నమ్మే ప్రజలు ఎంతవరకు జీర్ణం చేసుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: