కట్టడం కంటే కూల్చడం తేలిక.. నిర్మించడం కంటే.. దానిని కష్టపడి కట్టడం చాలా కష్టం.  ఏదైనా సరే నిర్మించాలంటే చమటోడ్చాలి.  వందలాది మంది సహాయ సహకారాలు తీసుకోవాలి.. ప్లాన్ వేయాలి.. దండిగా డబ్బులు ఉండాలి.  ఇలా ఎన్నో రకరకాల సాధనాలు ఉండాలి.  అలా ఉన్నప్పుడే అన్ని వర్కౌట్ అవుతాయి.  ప్రతిదీ ప్లాన్ గా చేసుకుంటూ పోవాల్సి వస్తుంది.  అలా కాకుండా కూల్చేయాలి అంటే ఎంతలో పని చిటికెలో పూర్తవుతుంది.  
ఒకప్పుడు కట్టాలి అంటే ఏళ్ళు.. కూల్చాలి అంటే నెలలు పట్టేది.  ఇప్పుడు అలా కాదు. నెలలతరబడి వందలాంది కూలీలు, కోట్లాది రూపాయల డబ్బు పెట్టి పదుల సంఖ్యలో అంతస్తులు నిర్మించిన ఎలాంటి కట్టడమైన సరే సెకన్ల వ్యవధిలో కూల్చేస్తున్నారు.  అందులో సందేహం అవసరం లేదు.  కట్టడానికి కూలీలు కావాలిగాని, కూల్చాడనికి అవసరం లేదు.  
దండిగా జిలెటిన్ స్టిక్స్ ఉంటె చాలు.  ఎలాంటి కట్టడం అయినా సరే క్షణాల్లో కూలిపోతుంది.  ఎంత కష్టమైనా వంతెన అయినా సరే యిట్టె సముద్రంలో మునిగిపోతుంది.  అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత కట్టడం ఎంతటి ఈజీ అయ్యిందో కూల్చడం కూడా అంతే ఈజీ అయ్యింది.  నెలలతరబడి ఇప్పుడు ఎలాంటి కట్టడాలు కట్టడం లేదు.  కూల్చడం లేదు.  టెక్నాలజీని వినియోగించి అన్నింటిని చిటికెలో కూల్చేస్తున్నారు.  కావాల్సింది నిర్మిస్తున్నారు.  
దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ లోని బ్యాంక్ ఆఫ్ లిస్బాన్ ఉన్నది.  ఇది 22 అంతస్తుల భవనం.  ఈ భవనంలో సెప్టెంబర్ లో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు.  ముగ్గురు మరణించడంతో.. ప్రభుత్వం కలత చెందింది.  22 అంతస్తుల భవనం ఫైర్ సేఫ్టీకి అనుగుణంగా లేదని భావించి కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది.  దీనికి బ్యాంకు నుంచి కూడా అనుమతి లభించడంతో పనులను షురూ చేసింది.  బ్యాంక్ భవనాన్ని జిలెటిన్ స్టిక్స్ సహాయంతో కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే కూల్చేసింది.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: