టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వత ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లూ అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు వాటిని ఎదుర్కోక తప్పేట్లు లేదు. ఓవైపు లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు వెంటాడుతోంది. మరోవైపు.. తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలోని ఓటుకు నోటు కేసు ఉరుముతోంది. ఈ కేసులే ఇలా ఉంటే.. ఇప్పుడు మరో కేసు సంగతి తేలుద్దామా అంటున్నారు వైసీపీ నేతలు.

 

ఇంతకీ ఆ కేసు ఏంటో తెలుసా.. ఎన్టీఆర్ మరణం కేసు.. అవును చంద్రబాబు వల్లే చనిపోయిన ఎన్టీఆర్ కేసును విచారిద్దామా అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇటీవల చంద్రబాబు కడపలో మాట్లాడుతూ తన సర్కారు అవినీతిపై జగన్ ఫైళ్లు వెదికించారని కానీ ఏమీ చేయలేకపోయారని.. ఎలుక తోకపై ఈకను కూడా పట్టుకోలేదని అన్నారు. దీనిపై శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వెంట్రుక కూడా పట్టుకోలేకపోయారని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు శ్రీకాంత్‌రెడ్డి .

 

చంద్రబాబు అంత అవినీతిపరుడు ఎవరు ఉండరని తేహెల్కా చెప్పిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబుకు తన కేసులపై నమ్మకం ఉంటే కేసులు వెకెట్‌ చేసుకొని విచారణకు సిద్ధం కావాలన్నారు. వివేకానందరెడ్డి హత్యపై చంద్రబాబు మాట్లాడటం సరికాదన్నారు. అన్ని కూడా బయటకు వస్తాయని, విచారణ నిక్కచ్చిగా జరుగుతుందన్నారు. నీ వల్లే చనిపోయిన ఎన్టీ రామారావు కేసును కూడా విచారణ చేయిస్తామన్నారు. ఆంబోతు అంటే చంద్రబాబు అని కరెక్ట్‌గా సరిపోతుందన్నారు.

 

విద్యార్థులు వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నతంగా చదివి విదేశాలకు వెళ్తుంటే..అది తన గొప్ప అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం బాధాకరమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కాకపోతే ఇవన్నీ విమర్శల కోసం కాకపోతే.. ఎన్టీఆర్ మరణం కేసు తెరిచేదీ ఉండదు.. విచారణ జరిపేదీ ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: