మహారాష్ట్రలో రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరిగిన తరువాత ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది.  మహా వికాస్ అఘాడి పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేసి శివసేన.. ఎన్సీపీ .. కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు.  చిన్న పార్టీగా మహారాష్ట్రలో ఆతరించి అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీతో కలిసి ఎదిగి.. ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది.  
సొంతంగా అంటే ఒంటరిగా కాదు.. సంకీర్ణంతోనే.  అయితే, ఉద్దవ్ థాకరే మొదటిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.  బాల్ థాకరే వారసుడిగా ఉద్దవ్ థాకరే రాజకీయాల్లోకి వచ్చారు.  థాకరే కుటుంబం రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఆ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయలేదు.  ఈ ఎన్నికల్లో ఉద్దవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరే పోటీ చేసి విజయం సాధించారు. 
అయితే, ఉద్ధవ్ థాకరే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.  1960 జులై 27 వ తేదీన ఉద్దవ్ థాకరే జన్మించారు.  1966 లో బాల్ థాకరే శివసేన పార్టీని స్థాపించినా.. ఆ తరువాత ఎప్పుడు అయన పార్టీ నుంచి పోటీ చేయలేదు.  పార్టీ అధ్యక్షుడిగానే ఉన్నారు.  1992లో అయోధ్య అల్లర్లు తరువాత శివసేన పార్టీ పూర్తి స్థాయిలో హిందూత్వ పార్టీగా ఆవిర్భవించింది.  
అప్పటి నుంచి బలం పెంచుకుంటూ వచ్చింది. 2012లో బాల్ థాకరే మరణం తరువాత ఆదిత్య థాకరే శివసేన బాధ్యతలు, సామ్నా పత్రిక బాధ్యతలు తీసుకున్నారు.  2019 వరకు శివసేన.. బీజేపీ మిత్రపక్షంగా ఉన్నది.  కానీ, 2019 ఎన్నికల తరువాత తమకే ముఖ్యమంత్రి పీఠం కావాలని శివసేన డిమాండ్ చేయడంతో రెండు పార్టీలు విడిపోయాయి.  ఇప్పుడు శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.  1966 లో పార్టీని స్థాపించినా.. ఇప్పటి వరకు ఉద్ధవ్ థాకరే ఎమ్మెల్యేగా కానీ,ఎంపీగా కానీ పోటీ చేయలేదు.  తండ్రి కోసం ఆదిత్య థాకరే తన సీటును త్యాగం చేయబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: