జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలే విచిత్రంగా ఉంటాయి. డిసెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు రాయలసీమ జిల్లాల పర్యటన పెట్టుకున్నారు. ఇపుడు ఎందుకంత హఠాత్తుగా నాలుగు జిల్లాల్లో పర్యటించబోతున్నారో  అర్ధం కావటం లేదు. ట్విట్టర్లోను, పార్టీ సమావేశాల్లోను ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వీలైనంత విషం చిమ్ముతున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

నిజానికి పవన్ కు ఏ విషయంలో కూడా లోతైన విషయం పరిజ్ఞానం లేదని తెలిసిపోతునే ఉంది. అన్నీ పై పై మాటలు మాట్లాడటం, అర్ధంలేని ఆవేశాన్ని తెచ్చుకుని అడ్డంగా ఊగిపోతు జగన్ ను నానా మాటలు అనటమే ఇప్పటి వరకూ పవన్ నుండి అందరూ చూసింది. రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి, జనసేన కూడా ఉంది అన్నట్లుగానే సాగుతోంది పవన్ పార్టీ రాజకీయాలు.

 

అలాంటిది ఇపుడు ఉన్నట్లుండి రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలు ఎందుకు పెట్టుకున్నట్లు ? నిజంగా మాట్లాడుకుంటే ఇప్పటికిప్పుడు అర్జంటుగా పర్యటనలు పెట్టుకోవాల్సిన అవసరమైతే పవన్ కు లేదు. అయినా ఎందుకు పర్యటిస్తున్నారంటే జనాలను జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టటానికేనా అనే అనుమానం వస్తోంది. రైతాంగ సమస్యలపైనే పర్యటన అని చెబుతున్నారు. కానీ ఏ సమస్యపైనా స్ధిరంగా పోరాటం చేసిన చరిత్ర పవన్ కు లేదు.

 

జనాలను రెచ్చగొట్టటం కూడా తనంతట తాను చేయటం లేదు. చంద్రబాబునాయుడు నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే పవన్ నడుచుకుంటున్నాడనే వైసిపి ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే చంద్రబాబు ఆదేశించినట్లుగానే పవన్ పర్యటనలు పెట్టుకున్నాడా ? అని అనుమానంగా ఉంది. గతంలో రాయలసీమ జిల్లాల గురించి పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.

 

పైగా రాజధానిని అమరావతి నుండి తీసేసి పులివెందులలో పెట్టుకోమన్నారు. హై కోర్టును కర్నూలులో పెట్టుకుంటే కేసుల విచారణలో కోర్టుకు హాజరవ్వటానికి తేలిగ్గా ఉంటుందంటూ జగన్ విషయంలో పవన్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో బలిజ-రెడ్డి సామాజికవర్గాల మధ్య గొడవలు పెట్టటానికి టిడిపి ప్రయత్నాలు చేసి ఫెయిలైంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాయలసీమలోని మొత్తం 52 అసెంబ్లీ సీట్లలో టిడిపికి దక్కింది కేవలం మూడంటే మూడే సీట్లు. ఇక 8 ఎంపి స్ధానాల్లో ఒక్కటి కూడా గెలవలేదు. అలాగే జనసేన పోటి చేసిన అన్నీ నియోజకవర్గాల్లోను ఓడిపోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. మొత్తం వైసిపి చాపచుట్టినట్లుగా అన్నీ సీట్లను ఎగరేసుకుపోయింది.

 

అందుకనే ఇటు చంద్రబాబుకు అటు పవన్ కు రాయలసీమంటే మండిపోతున్నారు. కాబట్టి జనాలను జగన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టటంలో ఇద్దరూ కలిసి ఏమైనా ప్లాన్  చేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: