ఏమరుపాటుగా ఉంటె ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో చెప్పక్కర్లేదు.  రోడ్డుపై వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నా.. రాత బాగాలేకపోతే ఎవరూ ఏమి చేయలేరు.  ఇది నిజం.. ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సమయం వస్తే జరిగేది జరుగుతుంది.  దానిని ఎవరూ కాదనలేరు.   నిన్నటి రోజున హైదరాబాద్ లో ఏం జరిగిందో చూశాం కదా.  మహిళ పాపం స్కూటీపై వెళ్తుంటే వెనగ్గా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.  పాపం ఆ మహిళా తల నుజ్జు నుజ్జు అయ్యింది.  
ఆర్టీసీ సమ్మె సమ్మె సమయంలో ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి బస్సులు నడిపిస్తున్నారు.  బస్సులు ఏ కండిషన్లో ఉంటాయో ఎవరికీ తెలియదు.  వాటిని చెక్ చేసుకోకుండా బయటకు తీసుకొస్తుంటారు.  ఫలితం ఇలానే ఉంటుంది.  హైదరాబాద్ లో రోడ్డుమీద వెళ్లే వ్యక్తులను ఢీకొట్టడం సహజమే.  కారణాలు ఏవైనా ఉండొచ్చు.  అది వేరే విషయం.  ట్రాఫిక్ విధులను నిర్వహించే వాళ్ళను ఢీకొట్టిన దాఖలాలు లేవు.  
ఇలాంటి సంఘటన చండీగఢ్ లో జరిగింది.  చండీగఢ్ లో పాపం ట్రాఫిక్ లో విధులు నిర్వహిస్తున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.  విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పైకి ఉన్నట్టుండి ఓ బస్సు స్పీడ్ గా దూసుకొచ్చి అతడిని గుద్దేసింది.  అయితే, బస్సు వెంటనే బ్రేకులు వేయడంతో ప్రాణాపాయం తప్పింది.  కానీ, ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి.  
గాయాలు కావడంతో పాపం ఆ కానిస్టేబుల్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  మధ్యలో ఎలాంటి సర్కిల్ లేకుండా అయన విధులు నిర్వహిస్తున్నారు.  ఈ సమయంలో బస్సు చూసుకోకుండా మలుపు తిరగడంతో ఈ ప్రమాదం జరిగింది.  దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.  ఇలాంటి ప్రమాదాలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు.  ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: