అమరావతిలో ఇపుడిదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు క్యాబినెట్ సమావేశాలకు ముందు జగన్ మాట్లాడుతూ ప్రతి మంత్రి వారంలో రెండు రోజులు కచ్చితంగా అమరావతి సచివాలయంలో ఉండి తీరాలని ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుండి వివిధ పనుల నిమ్మితం వస్తున్న జనాలకు మంత్రులంతా అందుబాటులో ఉండాలన్నది జగన్ ఉద్దేశ్యం.

 

జగన్ ఉద్దేశ్యం వరకూ బాగానే ఉంది కానీ మంత్రుల్లో చాలామంది పాటించటం లేదట. మొత్తం మీద 25 మంత్రుల్లో మహా అయితే ఓ పదిమంది కూడా సచివాయలంలో ఉండటం లేదట. తమిష్టం వచ్చినపుడు వచ్చి వెళ్ళిపోతున్నారట. మంత్రులు అందుబాటులో ఉండకపోవటంతో దాని ప్రభావం సిఎం పేషీ మీద పడుతోందట. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద గతంలో ఉన్నడు లేని విధంగా విపరీతమైన రద్దీ కనబడుతోంది.

 

ఒకేరోజు వేలాదిమంది తన కార్యాలయానికి వస్తుండటంతో సిఎంవో లో కూడా బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. ఎవరితో మాట్లాడుదామని పిలిపించినా ప్రతి ఒక్కళ్ళు నేరుగా జగన్ తోనే మాట్లాడాలని, సంతకం కావాలని చెబుతున్నారట. మంత్రులను కలిస్తే అయిపోయేదానికి సిఎం పేషి దాకా ఎందుకు వస్తున్నారని అడిగితే మంత్రులు అందుబాటులో ఉండటం లేదని సమాధానం వస్తోందట.

 

ఇదే విషయాన్ని సిఎంవో అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దాంతో అందుబాటులో ఉండని మంత్రులపై సిఎం బాగా మండిపోతున్నారని సమాచారం. అలాగే వారంలో ఒక్కరోజు జల్లాలోని పార్టీ కార్యాలయంలో నేతలకు, కార్యకర్తలకు ప్రతి మంత్రి అందుబాటులో ఉండాలని కూడా గతంలో జగన్ ఆదేశించారు. ఆ ఆదేశాలు కూడా పూర్తిగా అమల్లోకి రావటం లేదని సిఎం దృష్టికి వచ్చిందట.

 

అంటే మంత్రుల్లో ఎక్కువమంది ఇటు మామూలు జనాలకు వారంలో రెండు రోజులు అందుబాటులో ఉండక అటు వారంలో ఒక్కరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులకు కూడా అందుబాటులో లేకపోవటంతో రెండు విధాలుగానే  సమస్యలు పెరిగిపోతున్నట్లు జగన్ గుర్తించారు. కాబట్టి ఈనెలాఖరులో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో కొందర మంత్రులకు క్లాసులు తప్పక పోవచ్చని అమరావతి టాక్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: