ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి జరిగేందుకు  ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు  రైతులకు చేయూత నిచ్చేందుకు వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు .  ఈ క్రమంలోనే వ్యవసాయం చేయడం అంటే దండుగ అనుకునే పరిస్థితి నుంచి వ్యవసాయం చేయడం పండగ అనుకునేంత పరిస్థితికి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పరిస్థితులను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 

 


 అయితే రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు వైఎస్సార్ రైతు భరత్ అనే సంచలన పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ చేయూతనిచ్చేందుకు రైతుల ఖాతాల్లో ప్రతి ఏటా 13500 రూపాయలు జమ చేసేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. అయితే జగన్ ప్రభుత్వం రైతుభరోసా లో  కీలక మార్పులు చేస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు చెల్లించి 13500 రూపాయలను ప్రతి ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయించండి. 

 

 తాజాగా  వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేస్తూ మరో నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ఇప్పటికే రాష్ట్రంలో పట్టా  ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా అందుతుందని తెలిపింది జగన్ సర్కార్. ఇక ఇప్పుడు నియోజకవర్గ స్థాయి రాజ్యాంగ పదవులు పొందిన రైతు కుటుంబాల మినహా... ఇతర ప్రజాప్రతినిధులు అందరూ రైతు భరోసాకు  అర్హులంటూ  స్వల్ప మార్పులు చేసింది జగన్ సర్కార్. వీరికి మే నెలలో 7500 రూపాయలు... అక్టోబర్లో 4000 జనవరిలో రెండు వేల రూపాయలను అందించేందుకు నిర్ణయించింది. ఈ సవరణలకు సంబంధించి మార్గదర్శ కాలను జగన్మోహన్రెడ్డి సర్కార్ విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: