ఎవరైనా సరే నోటిని అదుపులో పెట్టుకుంటేనే గౌరవంగా ఉంటుంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా కాదని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే ఇదుగో బొత్సా పరిస్ధితి లాగే తయారవుతుంది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబునాయుడు పర్యటించటాన్ని ’స్మశానంలో పర్యటిస్తారా అంటు చేసిన వ్యాఖ్యలే ఇపుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి.

 

ఈనెల 28వ తేదీన చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. ఎందుకయ్యా పర్యటనంటే జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించటానికట. నిజంగా చంద్రబాబు పర్యటనే ఓ దండగమారి పర్యటన. రాజకీయంగా రచ్చ చేయటానికి తప్ప మరో ఉద్దేశ్యం లేదని తెలిసిపోతోంది. మరలాంటపుడు అధికార పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి ?

 

చంద్రబాబు పర్యటన తర్వాత ఎలాగు రెచ్చిపోవటం ఖాయం. ఎందుకంటే చంద్రబాబు ఐదేళ్ళ కాలంలో చేసిన తాత్కాలిక  నాసిరకం నిర్మాణాలు తప్ప మరేమీ జరగలేదు. ఆ విషయం చంద్రబాబుకు తెలియక కాదు పర్యటిస్తుంది. తనన కలల రాజధాని అమరావతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నీరుగార్చేసిందనే దుగ్ద బాగా ఉంది. అలాగే రాజధాని నిర్మాణ బాధ్యతల నుండి సింగపూర్ కంపెనీల కన్షార్షియం తప్పుకోవటాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్ కు వ్యతిరేకంగా నానా యాగీ చేసి తన తృప్తి తీర్చుకుందామనే చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు. కాబట్టి మాజీ సిఎం పర్యటన చేసేంత వరకూ వెయిట్ చేయాలి. పైగా మీడియా సమావేశంలో మాట్లాడేటపుడు ఒళ్ళు దగ్గరగా పెట్టుకునే మాట్లాడాలి. నోటికొచ్చింది మాట్లాడేసి ’తమిష్టం వచ్చినట్లు మాట్లాడుతాం మీరు మాత్రం రాయద్దంటే కుదరదు.

 

టివిల్లో లైవ్ వస్తున్నపుడు ఏమి మాట్లాడినా జనాలకు క్షణాల్లో చేరిపోతుందన్న స్పృహ మాట్లాడేవాళ్ళకుండాలి. కాబట్టి ఇకనుండైనా మాట్లాడేటపుడు నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్వీయ నిబంధన పెట్టుకుంటే అందరికీ మంచిది. లేకపోతే బొత్సాకు తలబొప్పికట్టినట్లే అవుతుంది అందరికీ.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: