చంద్రబాబునాయుడు ముందే తమ్ముళ్ళు కొట్టేసుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు కడపలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండో రోజు పర్యటనలో భాగంగా రాత్రి జిల్లాలోని నియోజకవర్గాల సమీక్షలను చేస్తున్నపుడు చంద్రబాబే షాక్ అయ్యారు. జిల్లా నేతల్లోని వర్గ విభేదాలు బయటపడి తమ్ముళ్ళల్లో ఇద్దరు దారుణంగా కొట్టేసుకున్నారు.

 

సమీక్షల్లో ఒక్కో నియోజకవర్గంలోని నేతలతో చంద్రబాబు మంగళవారం రాత్రి మాట్లాడారు. ఆ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలిపై కడప సమీక్షలో  ఓ నేత సుబ్బయ్య  చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఉదాహరణలతో వివరిస్తున్నారు.

 

అయితే రెడ్డి మద్దతుదారులు దాన్ని సహించలేకపోయారు. అదే విషయాన్ని ఫిర్యాదులు చేస్తున్న వ్యక్తికి చెప్పినా వినకపోవటంతో ఇక నేరుగా దాడి చేశారు. ఫిర్యాదు దారుడిని మాట్లాడనీయకుండా కొట్టేశారు. తనపై రెడ్డి మద్దతుదారులు టిడిపి ప్రభుత్వంలోనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేశారని చెప్పాటన్ని రెడ్డి వర్గీయులు సహించలేకపోయారు.

 

నేరుగా చంద్రబాబు దగ్గరే తమ నేతకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటాన్ని సహించలేకపోయిన మద్దతుదారులు వేదికపై చంద్రబాబున్నా లెక్క చేయలేదు. విచిత్రమేమిటంటే దాడి చేయటాన్ని చంద్రబాబు మాటలతో వారిస్తున్న ఏమాత్రం ఖాతరు చేయలేదు.  తన కళ్ళముందే పైగా తాను వారిస్తున్నా వినకుండా తమ్ముళ్ళు కొట్టేసుకోవటంతో చంద్రబాబు నోట మాట రాలేదు.

 

సరే వెంటనే ఇతర నేతలు స్పందించి వాళ్ళను విడదీశారనుకోండి అది వేరే సంగతి. మైకు దొరికితే చాలు క్రమశిక్షణకు తమ పార్టీ పెట్టింది పేరని చెప్పుకునే చంద్రబాబు ఇపుడీ ఘటనపై ఏమని సమాధానం చెబుతారో ? లేకపోతే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రగా అభివర్ణిస్తారో ? చూడాల్సిందే.  టిడిపి ప్రభుత్వం ఉన్నపుడే  తనపై టిడిపి నేతలే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టించటంపై చంద్రబాబు ఏమి సమాధానం చెబుతారు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: