ఎవరి ఊహలుకు ఎవరి అంచనాలకి అర్థం అవని ఎన్నికలుగా మహారాష్ట్ర ఎన్నికలు చరిత్రలో నిలబడతాయి అన్నది మాత్రం అక్షరాలా నిజం. గత నెలలో వెలువడిని ఫలితాల  రోజు నుంచి నిన్నటి వరకూ చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు అన్ని ఇన్ని కావు. బాల నిరూపణకు బలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే ఆశతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. చివరకు చేతులెత్తేసిన వైనం చూస్తే.. ప్రధాని మోడీ,హోమ్ మంత్రి అమిత్ షా లకు దిమ్మ తిరిగే షాక్ ను మహారాష్ట్ర రాజకీయాలు ఇచ్చిందని చెప్పాలి.

 

 నిన్న మంగళవారం ఉదయం దేశ అత్యున్నత సుప్రీంకోర్టు తీర్పుతో మొదలైన కలకలం. కొన్ని గంటల్లోనే ఎన్నో నాటకీయల మలపులకి కారణం అయింది. నాలుగు రోజుల పాటు ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీ పార్టీ దేవేంద్ర ఫడ్నవీస్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తమకు సంఖ్యాబలం లేదు అనిమీడియా ముందు ఒప్పుకొని రాజీనామా చేసారు  దేవేంద్ర ఫడ్నవీస్. ఈ సందర్భంగా కూటమి నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరారు.

 

మాములుగా ఉద్ధవ్ ఠాక్రే ఈ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే గవర్నర్ ను కలిసిన తరువాత కాస్త ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరటంతో ఆయన తన మనసు మార్చుకున్న రేపు ప్రమాణ స్వీకారం చేయటానికి ఒప్పుకున్నారు.  ముంబయిలోని ట్రైడెంట్ హోటల్లో భేటీ అయిన మహా వికాస్ అఘాడీ నేతలు.. తమ నేతగా ఉద్దవ్ ను ఎన్నుకున్న విషయం మన అందరికి తెలిసిందే.

 

భేటీ తర్వాత రాజ్ భవన్ కు వెళ్లిన ఉద్దవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయన సూచన మేరకు ఆదివారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: