నేడు  సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ  మంత్రివర్గం కేబినేట్ భేటీ జరగబోతుంది. ఈ కేబినేట్  భేటీలో వివిధ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్ నవశకం పేరుతో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ది చేకూర్చేందుకు కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలకు కేబినేట్ ఆమోదం తెలపనుంది. ప్రధానంగా వీటి పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని అంశంపై చర్చ జరగబోతుంది. 


 
ఇలా పలు అంశాలు ఉన్నాయి వాటి వివరాలు తెలుసుకుందామా మరి.  జగనన్న విద్యా దీవెన పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపే అంశం.  పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్‌) విధానంలో ఏర్పాటుచేసిన పోర్టులకు సంబంధించి ఆడిట్‌ కోసం సంస్థలను ఎంపికచేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  సీఆర్‌డీఏలో ఏ ప్రాజెక్టులను చేపట్టాలి, వేటిని చేపట్టకూడదనే వాటి పై నిర్ణయం. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

నేడు  ఉదయం 11గంటలకు సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌లో మంత్రివర్గం సమావేశనికి సిద్ధం అవుతున్నారు.  ఇక కొత్త బార్‌ పాలసీకి మంత్రి మండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇంకా  పలు మైనింగ్‌ లీజులపై ఆరోపణలు వస్తుండటంతో వాటిని రద్దుకు ఆమోదం తెలపనుంది. మరోవైపు... రాజధాని అమరావతి నిర్మాణంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుండడం, మరో వైపు  ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతుండటంతో ఈ అంశంపై కేబినెట్ చర్చలు జరపబోతుంది.


 వీటితోపాటు... డిసెంబర్‌ 21న ప్రారంభించే చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం పథకం అమలు విధానంపై చర్చ. ఉగాది నాటికి 25లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీకి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. ఇంకా మంత్రివర్గం  ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: