చంద్రబాబునాయుడుకు కడప జిల్లా సమీక్షల్లో రివర్స్ పంచ్ పడింది. కడప జిల్లా అంటేనే వైఎస్సార్ అడ్డా అన్న విషయం అందరికీ తిలిసిందే. అందుకనే దివంగత సిఎం వైఎస్సార్ గుర్తుగా కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మార్చారు. అలాంటి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు సహజంగానే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా జిల్లాలోని కార్యకర్తలే చంద్రబాబుకు రివర్స్ పంచ్ తో తల బొప్పి కొట్టించారు.

 

ఇంతకీ జరిగిందేమిటంటే రెండోరోజు పర్యటనలో భాగంగా కడపలోని ఓ మ్యారేజి హాలులో చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడితే తాము వినడం కాదని కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేశారు. దాంతో చంద్రబాబు మైక్ ఇవ్వగానే ఇక వాయింపుడు మొదలుపెట్టేశారు. ఐదేళ్ళ అధికారంలో జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

 

అసలు ఫిరాయింపులను ప్రోత్సహించి ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇవ్వటం వల్లే జిల్లాలో పార్టీ దెబ్బతిన్నట్లు మండిపడ్డారు. అలాగే క్షేత్రస్ధాయిలో ఎటువంటి పట్టులేని వ్యాపారవేత్త సిఎం రమేష్ ను ఎందుకు వరుసగా రాజ్యసభకు పంపుతున్నారో చెప్పాలంటూ నిలదీశారు. నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ చివరకు నియోజకవర్గంలో ఏమాత్రం బలంలేని వాళ్ళను ఎందుకు నెత్తిన పెట్టుకోవాల్సొచ్చిందో సమాధానం చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు.

 

రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజికవర్గం నుండి ఒక్కరికి కూడా పోటి చేసేందుకు టికెట్ కేటాయించలేదో చెప్పాలంటు సాయినాధశర్మ అనే కార్యకర్త నిలదీశారు. ఆకాశమే హద్దుగా అధికారాలను చెలాయించిన ఆదినారాయణరెడ్డి, సిఎం రమేష్ ల హయాంలో జిల్లాలో ఎందుకు సభ్యత్వ నమోదు జరగలేదో తెలుసా ? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారట. పార్టీ కోసం పనిచేసిన వారిని పూర్తిగా పక్కనపెట్టేసి బ్రోకర్టను, జనబలం లేని వాళ్ళకు మాత్రమే కిరీటం పెట్టిన కారణంగానే కడప జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లు సూటిగానే చెప్పారు. మధ్యలో చంద్రబాబు వారించినా కమలాపుం, పులివెందుల, జమ్మలమడుగు, కడప, బద్వేలు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు చంద్రబాబును ఫుల్లుగా వాయించేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: