మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు ప్రస్తుత వైయస్సార్ పార్టీ తరఫున మంత్రి అయిన కొడాలి నాని ఎప్పుడూ కాంట్రవర్సీలు వెతుక్కుంటూ వెళ్తుంటాడు. కాస్త దూకుడుగా వ్యవహరించే ఈ నేత ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కుక్కలు పశువులు, మేకలు మరియు ఇతర జంతువులతో పోల్చి చెప్పడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇటువంటి ఘాటైన విమర్శలు చేసిన కొడాలి నాని అసలు ఏ విషయంలో చంద్రబాబుని వాటితో పోల్చాడో తెలుసా..?

 

చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుండి హైదరాబాదులో కనీసం 0.1 శాతం కూడా నిర్మించలేకపోయాడని నాని బాబుని విమర్శించాడు. రాజధానిలో ఎలాగైతే కుక్కలు, పశువులు, మేకలు మరియు ఇతర జంతువులు తిరుగుతూ ఉంటాయో అలాగే చంద్రబాబు కూడా తిరుగుతూ ఉంటాడని... అసలు రాజధాని గురించి అతను పట్టించుకోనేలేదని నాని ఈ సందర్భంగా అన్నాడు. ఇప్పటివరకు చంద్రబాబు చంద్రమండలం లో ఉన్నాడని, ఇప్పుడే ఆయన కిందకి దిగి భూమి మీదికి వచ్చాడని నాని అన్నాడు. ఇకపోతే ఐదేళ్లలో చంద్రబాబు కనీసం నాలుగైదు బిల్డింగులు కూడా పూర్తి చేయలేక పోయాడు అని బాబు పై మండి పడ్డాడు.

 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజలకు అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలను గ్రాఫిక్స్ చేసి చూపించారని... కానీ అక్కడ కనీసం ప్రాథమిక పనులు కూడా పూర్తి కాలేదని నాని బాబు ని తప్పు పట్టారు. అయినా ఇప్పటికీ నాయుడు ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా సిగ్గులేకుండా అధికార పక్షాన్ని విమర్శిస్తున్నాడని నాని అన్నాడు. చంద్రబాబుని చాలా దారుణంగా విమర్శించిన కొడాలి నాని పై టిడిపి నేతలు ఇప్పటికే తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ ఉండగా... చంద్రబాబు దీనిపై ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: