ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో రాష్ట్ర పాలనలో ఒక నవశకం మొదలైందని చెప్పాలి. మునుపెన్నడూ చూడని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా నాయకుడిగా ప్రజలందరికీ ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ... ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి పథకాలు ఇంకెన్నో కీలక నిర్ణయాలు ఇలా దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన. పారదర్శక అవినీతి రహిత పాలన అందిస్తా ఆదర్శ ముఖ్యమంత్రిగా మారారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే...  రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల అందరికీ చేయూతనిచ్చేందుకు వైయస్సార్ వాహన మిత్ర పథకానికి ఊపిరిపోసింది జగన్ సర్కార్. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఏటా పది వేల రూపాయలను చెల్లించేందుకు నిర్ణయించింది. 

 

 

 

 కుటుంబంలో రెండు వాహనాలు ఉన్నప్పటికీ ఒక్క వాహనానికి మాత్రమే వైయస్సార్ వాహన మిత్ర పథకం వర్తిస్తుందని జగన్ ప్రభుత్వం నిబంధన పెట్టింది. అంతేకాకుండా ఆటో యజమానులకు మాత్రమే ఈ వైయస్సార్ వాహన మిత్ర పథకం వర్తిస్తుందని తెలిపింది. కాగా తాజాగా ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగించే వారికి కూడా వైయస్సార్ వాహన మిత్ర పథకం వర్తించేలా కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఆటో యజమానులకు కాకుండా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వారికి కూడా 10 వేల ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కార్ నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2, 36, 343 మంది లబ్ధి పొందుతున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. కాగా  ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ నెల చివరి వరకు అవకాశం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: