ఇటీవల తన సోదరుడి ద్వారా లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న గూడూరు తహసీల్దార్‌ నేటికీ ఆచూకీ  లభించలేదు అంటే నమ్మండి. ఇంతకీ హసీనా ఎక్కడ? ఇన్ని రోజులుగా తప్పించుకుని ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనేది ప్రస్తుతం పెద్ద ఆసక్తికర చర్చగా మారింది. రెవెన్యూ ఉన్నతాధికారుల చరవాణులకు సైతం ఆమె ఇంకా అందుబాటులోకి రాలేదు అంటే చాల ఆశ్చర్యమైన విషయం.ఇప్పటికే  హసీనాను   ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి అందరికి తెలిసిందే కదా. తప్పించుకుని తిరుగుతున్న తహసీల్దార్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

 తరువాత హసీనాబీ ఉంటున్న వసతి గృహాల్లో అన్నింటిలోనూ సోదా చేసినా ఆమె ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. ఆమె ఏకంగా 5 వసతి గృహాలు అద్దెకు తీసుకుని బాడుగ కడుతున్నది. ఇన్ని వసతి గృహాలు అద్దెకు తీసుకొని ఎందులో కావలిస్తే అందులో ఉంటుంది . ఈ విషయాన్ని గమనించిన అధికారులు  ఆశ్చర్యానికి గురి అయ్యారు.. 

 

హసీనాబీకి అతి స్నేహంగా ఉండే ఇద్దరు తహసీల్దార్లు మీరు నేరుగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లేదు కదా? ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకో’మంటూ ఉచిత సలహాలు ఇవ్వడము జరిగినది. కర్నూలు స్థానిక సీ క్యాంపులో ఉండే  కొత్తపల్లి మండల అభివృద్ధి అధికారి గిడ్డయ్య ఇంట్లో ఆమె ఉన్నట్లు తెలిసి కొన్ని రోజుల క్రితం అవినీతి అధికారులు  ఆకస్మిక తనిఖీ చేపట్టారు.. గిడ్డయ్య సారు సైతం నెలరోజులు మెడికల్‌ లీవ్‌ పెట్టినట్లు అధికారులు గుర్తించారుదీనిని బట్టి అధికారుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. ప్రస్తుతం వీరి కోసం గాలింపు కొనసాగుతున్నది.

 

 గూడూరు అధికారి హసీనాభీకి ఎటువంటి బెయిలు మంజూరు చేయొద్దంటూ ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. హసీనాభీకి  వేరే దారి లేదని, ఏసీబీ డీఎస్పీ వద్ద లేదా ఏసీబీ కోర్టులో ఆమె లొంగిపోవాలని అధికారులు సైతము చెబుతున్నారు.  ప్రజలు అవినీతికి ఆశ పడడం ఎందుకు, ప్రజలకు అధికారులకు కానరాకుండా ఎక్కడ దాక్కొని తిప్పలు పడడం ఎందుకు అని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: