టెక్నాలజీ తో చాలా జాగ్రత్తగా ఉండాలి, టెక్నాలజీని ఉపయోగించుకుని హీరో అవ్వచ్చు అదే ఏదైనా తేడా జరిగితే జీరో అనిపించుకుని పరువు కూడా పోగొట్టుకోవచ్చు. తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అమెజాన్ పరువు తీసేసాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభాన్ని ఉద్దేశించి ఒక ట్విట్టర్ ఖాతాదారుడు వ్యంగ్యగా ట్వీట్‌ను చేసాడు, ఇక ట్విట్టర్‌లో అమెజాన్ బాట్ (టెక్నాలజీ పై ఆధారపడి పని చేసే ఆటోమేటెడ్ సిస్టం) గందరగోళానికి గురై ఈ ట్వీట్ కు రిప్లై ఇచ్చేసింది ఇంకేముంది ఇక నెటిజన్స్ అమెజాన్ ను ఉద్దెశించి ఒకటే కామెంట్స్ పెడుతున్నారు. తప్పు తెలుసుకున్న అమెజాన్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది.

 

శనివారం, మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్ బీజేపీ కి మద్దతు ఇవ్వగా, దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్‌ డిప్యూటీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి నియమాలు ఉల్లంఘించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ప్రజలు. వారాంతంలో, శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి, కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పును మంగళవారం రిజర్వు చేసింది.

 

ఈ కేసుపై అన్ని రకాల వాదనలు వినిపించారు, మహారాష్ట్రలో  బిజెపికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముకుల్ రోహత్గీ కోర్టులో మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ కొద్ది రోజుల్లోనే విశ్వాస పరీక్ష కోసం పిలుస్తారని, వెంటనే విశ్వాస పరీక్ష అవసరం లేదని అన్నారు. సుప్రీంకోర్టులో బిజెపి చేసిన వాదనలు తీవ్ర దుమారాన్ని రేపాయ్. ఇక ఇదే విషయం కాలమిస్ట్ మరియు రచయిత సామ్రాట్ చౌదరి ట్విట్టర్‌లో ఎత్తి చూపారు. అతను ట్విట్టర్లో "బాల నిరూపణకు 7 రోజులు సమయం  ఎందుకు" అని ప్రశ్నించారు.

 

తరువాత వ్యంగ్య ప్రతిస్పందించిన, సామ్రాట్ "మీరు అమెజాన్‌లో ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ కోసం ఎలా ఎదురు చూస్తారో అలా చూడాల్సి వస్తోంది" అని పేర్కొన్నారు .ట్వీట్‌లో అమెజాన్ పేరు ఉపయోగించబడినందున, అమెజాన్ ఈ ట్వీట్ కు స్పందించి "మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు. దయచేసి మీ సమస్య గురించి వివరించండి." అని ట్వీట్ చెయ్యడంతో నెటిజన్స్ అమెజాన్ ను ట్రోల్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: