శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంత అభివృద్ధి చెందిన సరే మూఢనమ్మకాలను మాత్రం వీడటం లేదు. అలా అనటానికి ఈ ఘటనే నిదర్శనం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడంలోని కాలభైరవ ఆలయంలో తమిళనాడుకు చెందిన కొందరు దుండగులు క్షుద్రపూజలను నిర్వహించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

కాగా తమిళనాడు వాసులు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి ఏఈవో ధనపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గతంలోనూ ఏఈవో ధనపాల్‌ ఈ క్షుద్ర పూజలు చేస్తూ పెట్టుబడి సస్పెండ్ అయ్యాడు. అయితే ఈ కాలభైరవ ఆలయం క్షుద్రపూజలకు ప్రసిద్ద గాంచింది. 

 

కొన్ని ప్రత్యేక రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ధన్ పాల్ కు తమిళనాడు, కర్ణాటకలో శిష్యులు ఉన్నారు. అయితే వారి కోరికలు తీరటం కోసం ఇతను క్షుద్రపూజలు చేస్తూ ఉంటాడని సమాచారం. కాగా నిన్న 26 అమావాస్య కావడంతో అర్ధరాత్రి సమయం ధన్ పాల్ క్షుద్రపూజలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. దీంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

 

అయితే ఒక్క వీరు మాత్రమే కాదు.. డాక్టర్లు సైతం ఆసుపత్రుల్లో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు అంటే ఇంకా చుడండి.. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్య కళాశాలలోని బయోకెమిస్ట్రీ విభాగంలో నవంబర్ 17న వైద్యులు క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఓ గదిలో ఎండు మిరపకాయలు, పసుపు తదితర క్షుద్ర పూజ సామగ్రి కనిపించిందని రిమ్స్‌లో గుసగుసలు వినిపించాయి. అయితే కొందరు డాక్టర్ క్షుద్రపూజలు చేస్తుండగా చూశామని చెప్పగా మరికొందరు కావాలనే ఆ పూజ సామాగ్రిని అక్కడ వేశారు అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ కాలంలో కూడా మనం క్షుద్రపూజలు గురించి మాట్లాడుకోవటం చాలా దారుణం అనే చెప్పలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: