ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవ దహనం ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.  అయితే కొంత మంది లంచావతారులు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నారని..వారి బాధ తట్టుకోలేక బాధిుతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. మొదటి సారిగా ఒక ప్రభుత్వాధికారిని అదే కార్యాలయంలో హత్య చేయడం ఒకంత లంచగొండుల్లో కలవరం రేపింది.  ఇదే సమయంలో కర్నూలు జిల్లా గూడూరు ఎమ్మార్వో హసీనాబీ  ఓ రైతు భూమి లావాదేవీలో ఏకంగా 8 లక్షలు డిమాండ్ చేయడం.. అతడు 4 లక్షలకు బేరం అడటం.. ఈ నెల 7న హసీనాబి తన సోదరుడు బాషాను లంచం తీసుకునేందుకు పంపారు. 

 

సురేష్ అతడికి లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే రెడ్ హ్యాండెడ్ గా తన సోదరుడు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడని తెలిసిన వెంటనే హసీనాబీ పలాయనం చిత్తగించింది.  అప్పటి నుంచి ఆమె జాడ తెలియకుండా పోయింది.  ఇంతకీ ఆమె ఎక్కడ? ఇన్ని రోజులుగా తప్పించుకుని ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారనేది ఆసక్తికర చర్చగా మారింది. రెవెన్యూ ఉన్నతాధికారుల చరవాణులకు సైతం ఆమె అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం ఇప్పటికే ఆమెను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె పెద్ద జాదూ అని తెలుస్తుంది..ఇన్ని రోజుల నుంచి తప్పించుకుంటూ  తిరుగుతున్న తహసీల్దార్‌ హసీనాబీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.  

 

ఆ మద్య ఓ క్వార్టర్‌లో ఆమె నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో తలుపు పగలగొట్టి చూడగా.. ఓ వ్యక్తితో హసీనాబీ దిగిన ఫొటోలు కనిపించాయి. అతణ్ని కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యగా గుర్తించారు.  గిడ్డయ్యతో హసీనాబీ సహజీవనం చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హసీనాబీతోపాటు గిడ్డయ్య కూడా పరారీలో ఉన్నాడని తేల్చారు.  ఇదిలా ఉంటే...హసీనాబీకి మరో ఇద్దరు ఎమ్మార్వోలు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి సలహాతోనే ఆమె హైకోర్టును ఆశ్రయించినట్లు చర్చ జరుగుతోంది.  అయితే  ఏసీబీ అధికారులు కూడా బెయిల్‌ ఇవ్వొద్దంటూ కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: