జ‌గ‌న్‌కు ఏమాత్రం అనుభ‌వం లేద‌ని...తాను థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ...ఇక్క‌డ అంటూ చంద్ర‌బాబు ప్ర‌తీవేదిక‌పై గుర్తు చేస్తుండ‌టం ప‌రిపాటిగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రాజ‌కీయ చాతుర్యం ముందు ఆయ‌న థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ట్రాక్ రికార్డు బద్ధ‌లైపోయింది. 30 ఏళ్ల అనుభ‌వంతో క‌నీసం 30 సీట్ల‌ను కూడా సాధించుకోలేకపోయారు.  జ‌గ‌న్ ఆడుకున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో చంద్ర‌బాబు చిత్త‌య్యారు. ఇప్ప‌ట్లోనే కాదు..మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు కూడా ఆ పార్టీ కోలుకుంటుందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి.

 

ఇప్ప‌టికే కోమా ద‌శ‌లో ఉన్న పార్టీ మ‌రో ఐదేళ్లు మ‌నుగ‌డ‌లో ఉండేనా అన్న‌ది కూడా కోటి రూపాయాల ప్ర‌శ్న అంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నారు. వాస్త‌వ ప‌రిస్థితులు కూడా అందుకు అద్దం ప‌ట్టేలా ఉన్నాయి. ఇక తాజా విష‌యానికి వ‌స్తే... జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌గ‌న్ కంచుకోట‌లైన రాయ‌ల‌సీమ జిల్లాల‌పై  దృష్టి పెట్టార‌ట‌. త్వ‌ర‌లోనే నాలుగు జిల్లాలో ప‌ర్య‌టించి స్థానిక స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌నున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌ణాళిక తీరు చూస్తే హాస్యాస్పందంగా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఎద్దేవా చేస్తున్నారు.

 

ఉట్టి కొట్ట‌లేని మొగుడు..ఆకాశానికి ఎగురతాను అన్నాడ‌ట అన్న‌ట్లుగా ఆయ‌న తీరు ఉంద‌ని చెప్పుకొస్తున్నారు. ఎంతో కొంత బ‌లంగా ఉన్నా టీడీపీయే రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్ పార్టీని ఏం చేయ‌లేక‌పోయింది.. రాయ‌ల‌సీమ అంటే వైసీపీ అన్న‌ట్లుగా ఇటీవ‌లి ఫ‌లితాల్లో వెల్ల‌డైంది. తాను ఏదో చేద్దామని..ఎవ‌రినో ఉద్ద‌రిద్దామ‌ని బ‌య‌ల్దేరుతున్న ప‌వ‌న్ ఉన్న గాలి తీసుకోవ‌డం త‌ప్పా ఏం ఉండ‌ద‌ని  రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

 

ప‌వ‌న్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జ‌నాలు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల ముందు చేరిన పిడికెడు నాయ‌కులను ముందు వ‌వ‌న్ కాపాడుకోవ‌డంపై ముందు ప‌వ‌న్ శ్ర‌ద్ధ పెడితే క‌నీసం రాజ‌కీయ మ‌నుగ‌డ ఉంటుంద‌ని.. రాజ‌కీయ దుర్భేద్యంతో ఉన్న జ‌గ‌న్‌ను ఢీకొట్ట‌డం ఇప్పుడ‌యితే ఆయ‌న‌కు అంత శ్రేయ‌స్క‌రం కాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

 

ప‌వ‌న్ చెప్పొదొక‌టి..చేసేదొక‌టి..చెప్పేదానికి ..చేసేదానికి..సంబంధం లేకుండా ఉంటుంద‌ని..అస‌లు  ప‌వ‌న్ ఎప్పుడు ఏం చేస్తాడో త‌న‌కే తెలియ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తుంటార‌ని...ఇంకా చెప్పాలంటే కంటికి క‌న‌బ‌డ‌ని శ‌త్రువుల‌తో గాలిలో క‌త్తులు తిప్పుతుంటార‌ని ర‌క‌ర‌కాల సెటైర్లు పేల్చుతున్నారు.. వైసీపీ శ్రేణులు. రాజ‌కీయం సినిమా కాద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తిస్తే ఆయ‌నకు మాన‌సిక ప్ర‌శాంతత అయినా ల‌భిస్తుంద‌ని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: