వైసిపి నేత పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి జగన్ పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల పై ఘాటు విమర్శలు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గగ్గోలు పెడుతున్న విపక్ష పార్టీల పై  ఎన్నో సార్లు ట్విట్టర్ వేదికగా సంచలన విమర్శలు చేశారు. కాగా గత కొంతకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల పర్వం ఎక్కువైపోయింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక నిర్ణయాన్ని తప్పుబడుతూ  జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఇసుక సమస్యపై కూడా ఎన్నో విమర్శలు చేశారు. 

 


 అయితే ఇసుక సమస్య తర్వాత ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనే దానిపై ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. తెలుగు భాషను నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు గుప్పించారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో తెలుగు భాష మసకబారిపోతుంది  అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. విపక్ష పార్టీల విమర్శల లపై వైసిపి నేతలు అందరూ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే తాజాగా మరో సారి చంద్రబాబు విమర్శలపై పై సెటైర్ లు  గుప్పించారు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి. 

 

 ముందు ఇసుక సమస్యపై గగ్గోలు పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు  ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం పై విమర్శలు చేస్తున్నారని ట్విట్ చేసారు  విజయసాయిరెడ్డి. ఇసుక తుఫానులో  గిర్రున తిరిగి పడ్డాకా  ఇంగ్లీష్ మీడియం పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుండెలు బాదుకున్నారు అంటూ ట్వీట్ చేసారు. ప్రజలు ఛీత్కరించే  సరికి అసలు ఇంగ్లీష్ మీడియం ఆలోచనే  తమది అంటూ యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి అన్నారు . చంద్రబాబు బతుకంతా అవకాశవాదం మ్యానిప్యులేషన్సే  అంటూ విమర్శలు గుప్పించారు. పాతాళం లోకి జారి పోయిన మిమ్మల్ని ధర్మాన్ని సత్యం బృందం కూడా బయటికి లాగ లేరంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: