వ్య‌భిచారం...త‌ప్పుడు ప‌నే...కానీ గ‌త కొద్దికాలంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. కొంద‌రు పురుషుల్లో...మ‌రికొంద‌రు మ‌హిళ‌ల్లో ఉన్న బ‌ల‌హీన‌త‌ల‌ను...అవ‌స‌రాల‌ను అవ‌కాశంగా తీసుకొని  ఈ దందా విచ్చ‌ల‌విడిగా..ప్రాంతాలు, న‌గ‌రాల‌నే తేడా లేకుండా సాగిపోతోంది. వీటి ద్వారా ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి. అయినా ఈ త‌ప్పుడు ప‌నినే కొంద‌రు వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే వ్య‌క్తి అయితే... ఈ దారుణంలో పీక్స్ చేరాడు. త‌న వ్యాపారాన్ని కొత్త పుంత‌లు తొక్కించేందుకు...``మీరు వ్య‌భిచారం చేస్తారా..డ‌బ్బులు లేక‌పోతే మేం ఇస్తాం..ఇబ్బందేం లేదు` అని ఆఫ‌ర్ ఇచ్చి మ‌రీ... ఆ త‌ప్పులు య‌థేచ్చ‌గా చేయించాడు.

 

సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే...శెట్టి విష్ణుకాంత్ ఓ వడ్డీ వ్యాపారి. హైద‌రాబాద్ చెంగిచెర్ల ప్రాంతానికి చెందిన వ్య‌క్తి ఇత‌ను. వడ్డీ వ్యాపారంలో భాగంగా అవ‌స‌రం ఉన్న వాళ్ల‌కు అప్పు ఇస్తుంటాడు. అయితే, దానికి దాదాపు 5 నుంచి 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఇలా దందా న‌డిపిస్తున్న విష్ణుకాంత్‌కు ఏడాది కిందట ఓ వ్యభిచార నిర్వాహకురాలు పరిచయం అయింది. అయితే, ఆమెతో వ్యాపారం న‌డిపించాడు. వ్యభిచార గృహాల నిర్వాహకులకు ఫైనాన్స్ అందించ‌డం మొద‌లుపెట్టాడు. కాస్త రిస్క్ ఉంద‌నుకున్నాడేమో...మిగ‌తా వారి వ‌లే కాకుండా...వ్య‌భిచార నిర్వాహ‌కుల నుంచి 10 శాతానికి పైగా వడ్డీ వసూలు చేస్తున్నాడు. అయితే, అక్క‌డితోనే ఆగిపోలేదు.  వడ్డీ వ్యాపారం చేస్తున్న విష్ణుకాంత్ త‌న‌కు వడ్డీ కట్టడంతో పాటు... అమ్మాయిలను కూడా పంపాలను కండీషన్ కూడా పెట్టాడు. ఇలా అక్రమ వడ్డీతో ఫైనాన్స్ చేయడంతో పాటు చాలా మంది యువతులపై విష్ణుకాంత్ లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. 

 

ఇక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకుంటున్న వారి విష‌యానికి వ‌స్తే... విష్ణుకాంత్ వద్ద డ‌బ్బులు వడ్డీకి తీసుకుని.. శివారు ప్రాంతాల్లో సంపన్నులు నివసించే కాలనీల్లో వ్యభిచార గృహాలను ఏర్పాటు చేసుకుని జోరుగా దందాను నడిపిస్తున్నారు. ఎల్బీనగర్‌, సరూర్‌నగర్, మేడిపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఖ‌రీదైన‌ కాలనీల్లో గృహాలను అద్దెకు తీసుకుని వ్యభిచార దందా నడుపుతున్నారు. ఇటీవ‌ల రాచకొండ మల్కాజిగిరి ఎస్‌ఓటీ బృందం వ్య‌భిచారంపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌డంతో... సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. విష్ణుకాంత్ ఫైనాన్స్‌తో నడుస్తున్న వ్యభిచార గృహాలు సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో 1, మేడిపల్లి పరిధిలో-2, ఎల్బీనగర్ -1 స్థావరంపై సోదాలు జరిపి నలుగురు మహిళా నిర్వాహకులు, ఫైనాన్సియర్ విష్ణుకాంత్‌ను అరెస్ట్ చేసి ఆయా పోలీసు స్టేషన్‌లలో అప్పగించారు. ఏడుగురు బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు. 

 

ఇందులో షాక్‌కు గురికావాల్సిన అంశం ఏంటంటే...ఈ వ్య‌భిచార‌ గృహాల్లో బాధితులు కాబ‌డుతున్నఅమ్మాయిలు. హైదరాబాద్‌లో ఉద్యోగాలంటూ యువతులను కోల్‌కత్తా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి మహిళలు, యువతులను తీసుకువస్తున్నారు. ఆ సమయంలో వారికి అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు శెట్టి విష్ణుకాంత్ నుంచి వడ్డీకి తీసుకుని... నిర్వాహకులు దందాను శివారులో 15 స్థావరాలుగా విస్తరించారు. ఇలా వ్యభిచార గృహాలకు ఫైనాన్స్ ఇచ్చి, తన కన్నుసన్నుల్లో దాదాపు 15 వ్యభిచార గృహాలు నడుస్తున్న విష్ణుకాంత్ దందాను పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: