ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినేట్ ఆమోదం తెలియజేసిందని చెప్పారు. జగనన్న విద్యా దీవెన అనే పథకం కింద 100కు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ అందించాలని ఆదాయం మాత్రమే పరిమితిగా తీసుకున్నామని రెండున్నరలక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న అందరూ ఈ పథకానికి అర్హులవుతారని చెప్పారు. 
 
జగనన్న వసతి దీవెన పథకానికి మెస్ ఛార్జీల కింద ఐటీఐ చదువుకొనేవారికి సంవత్సరానికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదివే వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు, డిగ్రీ లేదా ఉన్నత చదువులు చదివే వారికి 20,000 రూపాయలు వసతి, భోజన సదుపాయాల కొరకు నగదు చెల్లింపు ఉంటుందని పేర్ని నాని తెలిపారు. డిసెంబర్ నెలలో 50 శాతం, జులై నెలలో 50 శాతం విద్యార్థులకు చెల్లించటం జరుగుతుందని పేర్ని నాని తెలిపారు. 
 
చదువుకునే పిల్లల తల్లి అకౌంట్లో ఈ డబ్బు జమ అవుతుందని పేర్ని నాని తెలిపారు. ఈ రెండు పథకాల కోసం 5,700 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని పేర్ని నాని తెలిపారు. వైయస్సార్ కాపు నేస్తం అమలుకు కేబినేట్ ఆమోదం తెలిపిందని కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకు ఆర్థికసాయం చేసేందుకు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడవారికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున 75,000 రూపాయలు ఆర్థిక సాయం చేయటానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. 
 
మార్చి 31 2020లోగా సీపీఎస్ కు, క్రాంటాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జూన్ 30 2020లోగా నివేదికలు సమర్పించాలని వర్కింగ్ కమిటీలకు ఆదేశాలు జారీ చేశామని పేర్ని నాని తెలిపారు. ట్రైబర్ వెల్ఫేర్ లో పని చేస్తున్న ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ కేటాయించినట్లు పేర్ని నాని తెలిపారు. కొత్త బియ్యం కార్డుల కొరకు గ్రామీణ ప్రాంతాలలో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలు తీసుకునేవారు అర్హులుగా కేబినేట్ నిర్ణయం తీసుకుందని పేర్ని నాని తెలిపారు. 
 
ఫీజు రీయింబర్స్ మెంట్ కు 2,50,000 రూపాయల ఆదాయ పరిమితి ఉన్నవారికి కార్డు ఇచ్చే విధంగా, 5,00,000 రూపాయలలోపు ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు అనే పథకానికి కేబినేట్ ఆమోదం తెలిపిందని 25 లక్షల మంది పేదలకు ఇళ్లు ఇవ్వాలని సంతృప్త స్థాయిలో అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశాలిస్తూ కేబినేట్ తీర్మానం చేసిందని చెప్పారు. మద్యం ధరల పెంపుకు, కడప స్టీల్ ప్లాంట్ శంఖుస్థాపనకు కేబినేట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని చెప్పారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: