నేటి ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంది.  భూమి,ఆకాశం,నీరు అన్నింటా మానవుడు జయించాడు. అయితే టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది కొన్ని అనర్థాలు కూడా సంబవిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది పోర్నోగ్రఫీ. పోర్న్ వీడియోలకు ముఖ్యంగా యువత బాగా అడిక్ట్ అయిపోతోంది.  టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నా... అంతకంటే ఇబ్బందులున్నాయనేది ఇటీవల కాలంలో అందరూ ఆందోళన చెందుతున్న విషయం. మనిషి యొక్క గొప్ప ఆవిష్కరణ సెల్ ఫోన్.  ప్రస్తుతం సామాన్యులకు కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. కొంత కాలంగా  స్మార్ట్‌ఫోన్లు వినియోగం పెరిగాక పోర్న్ చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.   

 

దీని ప్రభావంగానే ప్రస్తుతం  మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నది సామాజికవేత్తల ఆందోళన.  గతంలో పోర్న్ వీడియోలు చూడాలంటే సీడీలు తెచ్చుకొని చాలా సీక్రేట్ గా చూసేవారు..కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. అందులో ఇంటర్ నెట్ సౌలభ్యం ఉన్నవారు యేధేచ్చగా ఫోర్న్ వీడియోలు చూస్తున్నారు.. సాధారణంగా యువతకు సెక్స్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. యుక్త వయస్సు రాగానే దానిపైకి మనసు మళ్లుతుంటుంది. ఆ కోరికలను అణుచుకోవడానికే అబ్బాయిలు పోర్న్ తెగ చూస్తుంటారు.  నిర్దాక్షిణ్యంగా చొరబడుతున్న ఈ పోర్నోగ్రఫీ సంబంధిత లైంగికత్వ మానసిక చిత్రాలు ప్రతి ఒక్కరిపై దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

 

 జాతీయ కుటుంబ పరిశోధన, విద్యా సంస్థకు చెందిన పరిశోధకులు,  పోర్నోగ్రఫీకి అలవాటు పడినవారిలో అసహజ లైంగిక ప్రవర్తన వృద్ధిచెందే తీవ్ర ప్రమాదముంది” అని తేల్చిచెప్పారు.  అంతే కాదు జాతీయ కుటుంబ పరిశోధన, విద్యా సంస్థకు చెందిన పరిశోధకులు,  పోర్నోగ్రఫీకి అలవాటు పడినవారిలో అసహజ లైంగిక ప్రవర్తన వృద్ధిచెందే తీవ్ర ప్రమాదముందని నిపుణులు  తేల్చిచెప్పారు.  ఇక పోర్నోగ్రఫీకి అలవాటుపడడం సాధారణ దాంపత్య జీవితంలో ఆనందంతో పాల్గొనే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. 

 

యాదృచ్ఛికంగా చూడడంతో ప్రారంభమైన పోర్నోగ్రఫీని కట్టడిచేయకపోతే, చివరికది విశృంఖల, విపరీత లైంగిక దృశ్యాల స్థాయికి చేరుకుంటుంది. ఇది అసహజ లైంగిక కృత్యాలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య చాప క్రింద నీరులా మెల్లగా మనిషి జీవితాన్ని ఛిద్రం చేస్తూ..సర్వ నాశనం చేస్తుందని అంటున్నారు పరిశోదకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: