మహారాష్ట్రలో ఎన్నో మలుపులు ఎన్నో రాజకీయ సమీకరణాల మధ్య చివరికి శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు  సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా  ఎన్సీపీ నుంచి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయన్నున్నట్లు  తెలుస్తోంది.ఉద్ధవ్ థాక్రే  తో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే భేటీ  . కాగా శివసేన పార్టీ తన పంథా   నిలబెట్టుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి తమ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని పట్టుబట్టిన శివసేన పార్టీ... చివరికి తన పంథా నిలపెట్టుకొని ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే  ముఖ్యమంత్రి సీట్లో కూర్చోనున్నారు . 

 


 ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య చివరికి మహారాష్ట్ర తరువాత ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మొదట ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ సుప్రీంకోర్టు బలనిరూపణకు 24 గంటలు మాత్రమే సమయం ఇవ్వడంతో తమ దగ్గర ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యే సంఖ్యాబలం లేదని దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్  రాజీనామా చేయక మునుపే ఎన్సీపీ నేత ఉప  ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజీనామా చేశారు. 

 


 అయితే ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి రాజ్ ఠాక్రేను  ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నిన్న ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ సరైన సమయం వరకు వేచి చూసి ఆ తర్వాత సమాధానం చెబుతా అంటూ వ్యాఖ్యానించటం  ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే శివసేన పార్టీ ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత సరికొత్త వ్యూహాలను ప్రయోగించి బిజెపి పార్టీ ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ  కూల్చే అవకాశం ఉంది అంటూ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు ఉద్ధవ్ థాక్రే  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: