భారతదేశంలో యువత మునుపెన్నడూ లేనిస్థాయిలో ఆన్‌లైన్‌లో పోర్న్ చూస్తున్నారు. తక్కువ ధరకు లభించే స్మార్ట్‌ఫోన్లు, చౌక ఇంటర్నెట్ డేటాతో పోర్న్ కంటెంట్‌ కుప్పలుతెప్పలుగా అందుబాటులోకి వస్తుంది.  ఫలితమే ఈ పోర్న్ వీక్షణ, ఇలాంటి బరితెగింపు ఘటనల వ‌ల్ల దేశంలో చాలా అరాచ‌కాలు ఎక్కువ‌య్యాయ‌ని చాలా మంది భావిస్తున్నారు. ‘‘గత రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అతి చిన్న వ‌య‌సులోనే ఫోన్ వాడ‌టం వ‌ల్ల‌ పిల్లల పై ఇంటర్నెట్‌తో చాలా చెడు ప్రభావం పడింది. కేవలం 10 శాతం మంది మాత్రమే ఫోన్లను సమాచారం కోసం వాడుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా వీడియోలు చూడడానికే వాటిని వాడుతున్నారు. 

 

కాగా కొన్ని పోర్న్ సైట్లను నిషేధించాలని భారత ప్రభుత్వం గ‌తంలో ప్ర‌య‌త్నించింది. కొన్ని సైట్లు కూడా నిషేధించ‌డం జ‌రిగింది. వీటిలోని కంటెంట్ లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ద ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ వంటి కొందరి అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. యువకులతో సెక్స్ గురించీ, అంగీకారం గురించీ చర్చించడం ద్వారానే మార్పు సాధ్యమని అంటున్నారు వారు. దూరం నుంచి అమ్మాయిల వైపు చూసి వెకిలి నవ్వు నవ్వడం, వారిపై లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం కూడా వేధింపుల కిందకే వస్తుంది.

 

పోర్న్‌హబ్‌ను ఈ సంవత్సరంలో ఎక్కువగా చూసిన దేశాల్లో మన దేశం కూడా ఉండడం విశేషం. అమెరికా మొదటి స్థానం, బ్రిటన్ రెండో స్థానం, ఇండియా మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 3,350 కోట్ల క్లిక్స్ ఈ సైట్‌కి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఆరు రెట్లు పెరిగింది. ముఖ్యంగా 95శాతం మంది మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు. ముఖ్యంగా భారతీయుల్లో 18 నుంచి 24 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 44 శాతం మంది ఈ వయసు వారున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం ఏంటోగానీ యువత మాత్రం పాడవుతున్నదంటున్నారు కొందరు పెద్దలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: