ఇప్పుడు సమాజాన్ని క్యాన్సర్ లా పట్టి పీడిస్తుంది పోర్నోగ్రఫి. ఒకప్పుడు దేవదాసీ నృత్యాలు, తరువాత బూతుపుస్తకాలు, ఆ తరువాత బ్లూ సినిమాలు (నీలిచిత్రాలు), ప్రస్తుతం పోర్నోగ్రఫీ... లోలోపల దాగిఉన్న కోర్కెలను సంతృప్తిపరుచుకోవడమా?  ఈ సెక్స్‌ ప్రేరణలు కలిగించే దృశ్యాలపై శతాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని అందరికీ పోర్న్‌ చూసే సమాన అవకాశం లభించింది.  ఈ జాఢ్యం ఎంత వరకు వచ్చిందంటే అప్పుడప్పుడు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లో అమర్చిన టీవిల్లో కూడా ఈ దారుణాలు చూడాల్సి వస్తుంది.  

 

టీనేజర్లు, యువత, మధ్యవయస్కులు, ముసలివారు... వయసుతో నిమిత్తం లేకుండా వీటిని వీక్షిస్తున్నారు, 400 కోట్ల సైట్లు నేరుగాను, అనేకమైన రహస్యమైన పేర్లతో ఇంకా అనేకం కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి.  ప్రతిరోజూ ఫోర్న్ సైట్లలో ఇలాంటి అశ్లీల వీడియోలు అప్ లోడ్ అవుతూనే ఉన్నాయని అంటున్నారు. ఎదుటివారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎదుటివార్ని హింసించి సంతృప్తి పొందే లైంగిక ఇచ్ఛలను రెచ్చగొట్టే ఈ పోర్నోగ్రఫీ మానవ వికృతాలపై లాభాలను సంపాదిస్తుంది. దీని వల్లనే ప్రతిరోజూ ఆడవారిపై లైంగి వేధింపులు, అత్యాచారాలు చివరికి హత్యలకు కూడా తెగబడుతున్నారు.  

 

మన దేశంలో ఆండ్రాయిడ్‌ ఫోన్లు వచ్చాక 13-35 ఏండ్ల మధ్య వయస్కుల్లో 70 శాతం పైగా పోర్న్‌ చూస్తున్నారు. స్త్రీలూ ఇందుకు మినహాయింపు కాదు కానీ వీరి శాతం తక్కువ. పోర్న్‌ చూసేవారి ఊహల్లోకి ఉద్రేకం, హింస, ఆధిపత్యం, వికృత చర్యల పట్ల కోరికలు నిరంతరాయంగా పెరుగుతూనే కొంత మంది పరిశోదలకులు చెబుతున్నారు. అయితే ఒక్కసారి పోర్నోగ్రఫీకి అలవాటు పడినవారు.. క్రమంగా అందరికీ దూరమైపోయి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. 

 

ఆరోగ్యకరమయిన సహజ శారీరక సంబంధాలపై విముఖత ఏర్పడుతుంది. పోర్న్‌ చూస్తూఉండకపోతే లైంగిక తృప్తి పొందలేరు. రాను రాను పోర్న్‌ మరింత క్రూరంగా, జుగుప్సాకరంగా నిర్ఘాంతపోయేంత అమానవీయంగా మారుతున్నది. ఏది ఏమైనా మనిషి టెక్నాలజీ పెంచుకుంటూ పోతున్నాడు..దానితో పాటు తమ జీవితాలు నాశనం చేసుకుంటూ పోతున్నాడని చెప్పడానికి ఫోర్నోగ్రఫీ పెద్ద ఉదాహారణ.

మరింత సమాచారం తెలుసుకోండి: