ఆది మానవుడి దశ నుంచి మనిషి ఈ రోజు ఈ స్థితికి వచ్చాడు. భూమ్మీద జీవి  పుట్టుక అన్నది లక్షల కోట్ల సంవత్సరాలు అంటారు. ఆ వివరాలను పక్కన పెడితే  అలా పుట్టిన మనిషి ఒక్కో అడుగూ ముందుకే వేశాడు. ఇంతవరకూ అలా సాగిన మానవ పయనం ఇపుడు ఆగిపోయినా బాగుండేది, చిత్రమేంటంటే తిరిమగమనం వైపు అంటే వెనక్కు అడుగులు పడుతున్నాయి. తాను వచ్చిన చోటకే మళ్ళీ మనిషి వెళ్తాడా, లేక తానే లేకుండా పోతాడా అన్నదే ఇక్కడ ప్రశ్న.

 

ఒకపుడు మనిషి శ్రుంగారం ఆరు బయటే చేసేవాడు అంటారు. అయినా అతనికో కామం సమపాళ్ళలో ఉండేది. అలాగే కొన్ని తరాలు వెనక్కి వెళ్తే ఆడ మగా బట్టలు  కూడా వేసుకునే వారు కాదు. అయినా సరే మనిషి మనసు పవిత్రంగానే ఉంది. ఇపుడు అన్నీ కట్టుకుని సంస్కారం నిండా చుట్టుకుని కనిపిస్తున్న ఆధునిక మానవుడు ఆటవిక జాతి కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నాడు.  ఆ కళ్ళ నిండా కామమే కనిపిస్తోంది. కసిగా అది ఊపేస్తోంది. మెదడు సైతం విష్యతుల్యం అయిపోయింది.

 

తెల్లారి లేచింది మొదలు కామాలే లేని కామం కట్టకు తెంచుకుంటోంది. బుసలు కొట్టి పడగలెత్తుతోంది. ఇందులో వావీ వరస, సభ్యత, మర్యాదా అన్నీ మంటగలిసిపోతున్నాయి. కామాతురాణాం నభయం నలజ్జ అని అంటారు. అలా సిగ్గులన్నీ వదిలేసి మనిషి చేస్తున్న విక్రుత క్రీడకు మానవాళీ మొత్తం సమిధగా గా మారుతోంది.

 

దీనికి కారణం పోర్నోగ్రఫీ. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. నగ్నంగా మనిషిని నిలబెట్టేసింది. పరువు ప్రతిష్టలను లేకుందా దిగజార్చేసింది. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న న్యూడ్ మూవీస్ వావీ వయసు తేడా లేకుండా ఎవరినీ నిద్రపోనీయడంలేదు. కంటికి కునుకు రానీయడం లేదు. దాంతో బుసలు  కొడుతున్న కామం అందుబాటులో ఉన్న వారిని ఠక్కున కాటేస్తోంది. అపుడే పుట్టిన పసిపాప నుంచి అరవయ్యేళ్ళ ముసలివాళ్ళు వరకూ ఈ కామం కాటుకు బలి అవుతున్నారు. విచ్చలవిడిగా వచ్చిపడుతున్న పొర్న్ వీడియోలకు కోట్లలోనే వీక్షకులు ఉన్నారని సర్వేలు తేల్చుతున్నారు. 

 

నూటికి తొంబై శాతం స్మార్ట్ ఫోన్లలో పోర్న్ వీడియోలనే  చూస్తూ  మెద‌డుని పూర్తివ విషం చేసుకుంటున్నారు. ఇక వారి కంటికి ఆడ మగా తేడా తెలియడం లేదు. తమ కామాన్ని కుమ్మరించేంతవరకూ వారిలోని కామాంధుడు వూరుకోవడంలేదు. గంగవెర్రులెత్తించేస్తున్నాడు. దాంతో కాముకుడుగా మారి అత్యాచారాలకు హత్యలకు కూడా తెగబడుతున్నాడు. ఆ సమయంలో చట్టాలు  కనిపించవు. కామావేశంలో రాజ్యాంగాలు, కట్టుబాట్లు అంతకంటే ఉండవు. అందుకే  బరితెగించేస్తున్నాడు. ఈ మొత్తం పాపంలో అసలు దోషి పోర్న్ వీడియలే. వాటిని బంద్ చేయాలన్నది ప్రపంచ  ఉద్యమంగా మారింది. ఇండియాలో మాత్రం ఎక్కడపడితే అక్కడే పోర్న్ వీడియోలు  దొరుకుతున్నాయి. అందుకే కామాధులు గజానికొకడు తయారవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: